సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తూ కల్లోలం రేపుతుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానికి ప్రజల ప్రాణాల కన్నా అతడి స్వార్థమే ముఖ్యమని తెలిపారు. సెంట్రల్ విస్టాలో భాగంగా 2022 డిసెంబర్‌లోపు ప్రధానమంత్రి నివాసం సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా వాటిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ నరేంద్రమోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంగళవారం ఓ ట్వీట్ చేశారు. సెంట్రల్ విస్టాకు ఖర్చు చేసే రూ.13,450 కోట్లతో ప్రస్తుతం కరోనా సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
‘ఆ నిధులతో 45 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేయవచ్చు.
లేదా ఒక కోటి ఆక్సిజన్ సిలిండర్లకు ఉపయోగపడుతుంది.
లేదా రెండు కోట్ల ప్రజలకు నెలకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిచవచ్చు.
కానీ ఇవేవీ కాకుండా ప్రధానికి ప్రజల కన్నా అతడి స్వార్థం చాలా ముఖ్యం’ అని రాహుల్ మండిపడ్డారు.
ప్రస్తుతం దేశం తీవ్ర కష్టాల్లో ఉందని.. ఈ సమయంలో ప్రధానమంత్రి తన నివాసం సిద్ధం చేయడానికి గడువు విధించడం అందరూ విమర్శిస్తున్నారు. ఈ సమయంలో అలాంటి పనులపై దృష్టి సారించాల్న అని నిలదీస్తున్నారు. ప్రజలకు వైద్య సదుపాయాలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ సిలిండర్ సరఫరా వంటి వాటిపై ప్రధాని దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
చదవండి: వ్యాక్సిన్‌పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం
చదవండి: సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్
₹13450 crores for Central Vista.
— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2021
Or, for fully vaccinating 45 crore Indians.
Or, for 1 crore oxygen cylinders.
Or, to give 2 crore families NYAY of ₹6000.
But, PM’s ego is bigger than people’s lives.
Comments
Please login to add a commentAdd a comment