ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. నేటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శక్తి వనరులు, ఆహార భద్రత, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందాలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా ఇరుదేశాల అధికారులు చర్చలు జరపనున్నారు.
ఇండియా-యూఏఈ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరంగా వృద్ధి చెందుతుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పర్యటన ఆ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది. శక్తి వనరులు, విద్యా, ఆరోగ్య రంగం, ఆహార భద్రత, సంస్కృతిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు ఏర్పడనున్నట్లు వెల్లడించింది.
#WATCH | PM Narendra Modi has arrived in Abu Dhabi on an official visit to UAE pic.twitter.com/387DtRaqeV
— ANI (@ANI) July 15, 2023
ప్రపంచ సమస్యలపై ఇరుదేశాల నాయకులు చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యూఏఈ అధ్యక్షతన జరగనున్న కాప్-28 సమావేశం, ఇండియా అధ్యక్షతన జరుగుతున్న జీ-20 పై కూడా మాట్లాడనున్నట్లు వెల్లడించింది. మోదీ ఫ్రాన్స్ పర్యటన అనంతరం యూఏఈకి వెళ్లారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో ప్రత్యేకంగా సమావేశంలో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక పలు ఒప్పందాలు కుదిరాయి.
ఇదీ చదవండి: ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్
Comments
Please login to add a commentAdd a comment