
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేసి విజయం సాధించాలంటూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. కొత్తగూడెంలో సోమవారం ఆయన మీడి యాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌తో పాటు మైనార్టీలు ఎక్కువగా ఉండే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారని, వీటితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే బాగుంటుందని అన్నారు.
ఒకవేళ కేసీఆర్ ఇక్కడ పోటీకి దిగితే ఆయనపై బ్యాలెట్ పోరుకు తాను సిద్ధమేనని తెలిపారు. తనకు, కుటుంబానికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా కుటుంబసభ్యులతో చర్చించాకే బీఆర్‌ఎస్‌ను వీడానని పొంగులేటి చెప్పారు.
చదవండి: ర్యాలీలు.. సభలు
Comments
Please login to add a commentAdd a comment