సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వద్దకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈనెల 24 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రైతాంగాన్ని కలవడం ద్వారా టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు వారిని మోసగిస్తు న్న విధానాన్ని వివరించాలని పార్టీ నేతలు నిర్ణయిం చారు. ఈ పర్యటనల్లో భాగంగా ఉమ్మడి జిల్లాల పరిధిలో ఒక్కొక్క రోజు ఆ జిల్లా పరిధిలోని రెండు లేదా మూడు ప్రాంతాల్లో రైతులను కలుస్తారు. రచ్చబండపై వారితో మాట్లాడి పూర్తి స్థాయిలో వారి సమస్యలను అవగాహన చేసుకోవడం ద్వారా రైతాంగ ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించుకునే ప్రణాళికతో వెళ్లనున్నారు.
ధాన్యం కొనుగోళ్ల సమస్య ఎందుకు వచ్చింది, ఈ విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీలు ఏ విధంగా రైతులను మభ్యపెడుతున్నాయో పూర్తిస్థాయిలో తెలియజేయాలని, కాంగ్రె స్ ప్రభుత్వాల హయాంలో తెలంగాణ రైతాంగానికి జరిగిన మేలు, ఆ పార్టీ హయాంలో నిర్మించిన ప్రా జెక్టుల వల్ల జరిగిన అభివృద్ధిని కూడా రైతులతో పంచుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు టీపీసీసీ కిసాన్‌సెల్ నేతృత్వంలో షెడ్యూల్ రూపొందించారు.
రచ్చబండ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. రచ్చబండలో భాగంగా కాంగ్రెస్ రైతు అనుకూల విధానాన్ని, టీఆర్‌ఎస్, బీజేపీల రైతు వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున రైతుల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాన్ని రూపొందించామని టీపీసీసీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేశ్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment