రాయ్‌పూర్: మోదీ సర్కారు కేవలం ఆదానీ వంటి ఇద్దరు ముగ్గురు కుబేరుల కోసమే పనిచేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదానీ సర్కారుగా మారిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం ఎప్పటికీ పేదల కోసమే పని చేస్తాయని హామీ ఇచ్చారు.
ఛత్తీస్‌గడ్‌లోని నవరాయపూర్ మేళా స్థల్ లో శనివారం జరిగిన రాజీవ్ యువ మిలన్ క్లబ్ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పారీ్టదేనని ధీమా వ్యక్తం చేశారు. వాటితో పాటు ఇప్పటికే కాంగ్రెస్ పాలల్లో ఉన్న కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్‌గఢ్ వంటి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు అదానీ వంటి కుబేరుల కోసం కాకుండా పేదల కోసం మాత్రమే పనిచేస్తాయని పునరుద్ఘాటించారు.
ద్వేషంతో ప్రగతి అసాధ్యం
హింస ద్వేషాలతో దేశం ఎన్నటికీ ప్రగతి సాధించలేదని రాహుల్ అన్నారు. ప్రేమ సహనంతో అందరిని కలుపుకొని పోయినప్పుడు మాత్రమే దేశం ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివాసీలు అడవుల్లోంచి బయటికి వచ్చి పలు రంగాల్లో వారి కలలను నిజం చేసుకోవడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదని ఆరోపించారు. అందుకే వారిని ఆదివాసీలు అని కాకుండా వనవాసీలు అని పిలుస్తుందని విమర్శించారు. అదానీ అక్రమాలపై విచారణకు మోదీ ఎందుకు ఇష్టపడటం లేదో దేశ ప్రజలకు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. మోదీ పాలనలో ఎక్కడపడితే అక్కడ పుట్టుకొచి్చన విద్వేషపు బజారులలో ప్రేమ దుకాణాలను తెరవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment