సాక్షి, హైదరాబాద్: దేశంలో మళ్లీ అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కాగా, రాహుల్ గాంధీ యాత్ర ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జరుగుతోంది. కాగా, జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘బీజేపీ, టీఆర్‌ఎస్ దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. బీజేపీ హింసను ప్రేరేపిస్తుంటే.. టీఆర్‌ఎస్ వంతపాడుతోంది. ఉభయ సభల్లో బీజేపీకి, టీఆర్‌ఎస్ మద్దతుగా ఉంది. తెలంగాణలో రాజుల పాలన ఉంది. అటవీ హక్కుల చట్టంతో గిరిజనులకు మేము భూములిచ్చాము.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటోంది. మేము అధికారంలోకి వస్తే అటవీ హక్కుల చట్టం పూర్తిగా అమలు చేస్తాము. దళితుల భూములకు వారికే పూర్తి హక్కులు ఇస్తాము. భూములను లాక్కోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి తప్పులను సరిదిద్దుతాము. జీఎస్టీ పేరుతో నష్టపోతున్నామని చేనేత కార్మికులు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోని రాగానే జీఎస్టీలో మార్పులు చేస్తాము’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment