
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు హ్రస్వ దృష్టి, ద్వంద్వ ప్రమాణాలే రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టుల్లో నీటికోసం ఢిల్లీలో పోరాడతామంటూ హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంట్లో టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న 2014–19 మధ్య రాయలసీమ ప్రాజెక్టులకు ఏం ఒరగబెట్టారని సోమవారం ఓ ప్రకటనలో రామచంద్రయ్య ప్రశ్నిం చారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో సాహసోపేతంగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ప్రాజెక్టు చే పట్టారని.. అలాగే, దానిపై తెలంగాణలో న్యాయపోరాటం చేయడానికీ సిద్ధపడ్డారన్నారు. నీటి హ క్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని జగన్ నిరూపిస్తున్నారని రామచంద్రయ్య కొనియాడారు. బాబు మాత్రం రాష్ట్ర హక్కుల్ని కాలరాసే విధంగా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో లేఖ రాయించారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment