
బండి సంజయ్ పాదయాత్రలో భయ్యా మల్లేశ్.. కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో..
సాక్షి, రంగారెడ్డి: కేశంపేట మండల కేంద్రంలోని కొనాయపల్లి సర్పంచ్ భయ్యా మల్లేశ్ తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్రలో సర్పంచ్ పాల్గొన్నారు. అంతేకాకుండా కాషాయ జెండా పట్టుకుని పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు.. శనివారం జరిగిన కాంగ్రెస్‌పార్టీ రచ్చబండలో సైతం సర్పంచ్ పాల్గొనడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని పార్టీ అధికారంలోకి రావాలంటూ ప్రసగించారు. పదిహేను రోజుల వ్యవధిలోనే పార్టీలు మారడంతో గ్రామస్తులు అయోమయానికి గురవుతున్నారు.
చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం.
Comments
Please login to add a commentAdd a comment