కంటోన్మెంట్ (హైదరాబాద్): చాలాకాలం దున్నపోతు లతో తిరిగి వాటి పెండ పిసికే అలవాటున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనను పిసికేస్తానంటూ ప్రగ ల్భాలు పలకడం హాస్యాస్పదమని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయినా ఆయన ఏం పిసకాలనుకుంటు న్నాడో సమయం చెబితే తాను వస్తానని చెప్పారు. తలసాని ఎన్నాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాళ్లు పిసికినా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి అధ్యక్షుడినైన తన స్థాయికి రాలేడ ని వ్యాఖ్యానించారు.
బుధవారం కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అరటిపళ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్‌పరాగ్ నమిలేటోడు కూడా తన గురించి మాట్లాడితే గౌరవంగా ఉండదని రేవంత్ అన్నారు. తలసాని పాన్‌పరాగ్ మానేస్తే బాగుంటుందని, ప్రజాప్రతినిధులుగా మనం యువ కులకు ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు.
కేంద్రం, రాష్ట్రం నిధులివ్వాల్సిందే..
కంటోన్మెంట్‌కు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాల్సిందేనని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సర్విసు చార్జీల బకాయిలు ఇప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఉందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌కు రావాల్సిన పన్నుల వాటాను తన ఖాతాలోకి మళ్లించుకోకుండా నేరుగా కంటోన్మెంట్‌కే చెల్లించాలన్నారు. హైటెక్ సిటీ సమీపంలో మెట్రోకు అప్పగించిన 15 ఎకరాలను దొడ్డిదారిన ప్రైవేటు సంస్థకు ఇచ్చారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
తలసానికి రేవంత్ క్షమాపణ చెప్పాలి
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను దూషించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డిని ప్రజా క్షేత్రంలో యాదవ్ కురుమలు అడ్డుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. యాదవ కురుమలకు పెండ పిసకడం తెలుసు, బరాబర్ నీ కుతిక పిసకడం కూడా తెలుసు అని హెచ్చరించారు. రేవంత్ క్షమాపణ చెప్పకపోతే జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు.
చదవండి: నీకు మైండ్ ఉందా.. నువ్వు నోర్మూసుకో
Comments
Please login to add a commentAdd a comment