కేకే ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లిన సీఎం, కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్‌లో కేకే ఎప్పుడు చేరే అంశంపై చర్చ
నేడు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్, భట్టి, ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇత ర కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తన ఇంట్లో విందు ఇచ్చారు. కేకే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ కార్యక్ర మం ఏర్పాటు చేశారు. కేకే శుక్రవారమే సీఎం నివాసానికి వెళ్లి.. తన ఇంట్లో డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. పలువురు మంత్రులు, నేతలను కూడా రావాలని కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్‌యాదవ్, సీనియర్ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి వెళ్లారు.
శనివారం ఉదయమే కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్, కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి వారికి స్వాగతం పలికారు. కేకే ఆతిథ్యాన్ని స్వీకరించాక రేవంత్ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కేకే ఎప్పుడు కాంగ్రెస్‌లో చేరుతారు, ఎవరి సమక్షంలో చేరుతారన్న దానిపై నేతలు చర్చించారు. అయితే కేకే ఆదివారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కడియం శ్రీహరి, కావ్య నేడు చేరే చాన్స్!
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతారన్న దానిపై స్పష్టత రాలేదు. శనివారం తన అనుచరులతో సమావేశమైన కడియం.. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మాత్రమే చెప్పారు. మరోవైపు లోక్‌సభ అభ్యరి్థత్వాల ఖరారు కోసం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆదివారం ఢిల్లీలో సమావేశం కానుంది. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేయనున్నట్టు సమాచారం. కడియం కుమార్తె కావ్య వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో ఉంటారన్న చర్చ నేపథ్యంలో.. శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారమే కాంగ్రెస్ కండువా కప్పుకొనే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కాగా సీఈసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు.
కాంగ్రెస్‌లో విజయలక్ష్మి చేరిక
బంజారాహిల్స్ (హైదరాబాద్): కేకే కుమార్తె, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి క్యాంపు ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌ల సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment