సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ నాలుగేళ్లలోనే పరిష్కరించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి తీసుకునే విధానపరమైన నిర్ణయాలను ప్రజల చెంతకు చేర్చాల్సిన బాధ్యత ఉద్యోగులదే కాబట్టి వారు ప్రశాంతంగా పనిచేసుకునేలా అనువైన వాతావరణాన్ని కల్పించారని చెప్పారు.
ఉద్యోగులకు సమస్యలు లేకుండా ఉంటే మరింత మనసుపెట్టి పని చేయగలరని బలంగా విశ్వసిస్తూ వారి సమస్యలన్నీ సీఎం జగన్ పరిష్కరించారని తెలిపారు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోకూడదని సీఎం దృఢంగా భావిస్తారని చెప్పారు. అలాంటి స్థిరమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఎలా ఉంటుందో, సమస్యలను పరిష్కరించే ఆలోచన, ఎంత తక్కువ సమయం తీసుకుంటారో ఈ నాలుగేళ్లలో అందరూ చూశారన్నారు. కోవిడ్ సంక్షోభం సమయంలో అన్ని రకాలుగా ప్రజలకు తామున్నామని ప్రభుత్వం ముందడుగు వేయడంలో సీఎం ఆలోచనకు తోడు ఉద్యోగుల పాత్ర కూడా కీలకమన్నారు.
స్వల్ప వ్యవధిలో కీలక మార్పులు: బండి శ్రీనివాసరావు
ప్రభుత్వ వ్యవస్థలో అతి తక్కువ కాలంలో అనేక మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపరేఖలనే మార్చేశారన్నారు. 1.35 లక్షల ఉద్యోగాలు కలి్పంచి గ్రామ స్థాయికే పరిపాలనను వికేంద్రీకరించారని గుర్తు చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ప్రశంసించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దికరించాలని కోరితే సుప్రీంకోర్టు తీర్పు ఉందని గత ప్రభుత్వం తప్పించుకుందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వారిని క్రమబద్దికరించడం గొప్ప విషయమన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 16 శాతం పెంచిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఒకటో తేదినే జీతాలు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వంలోనే మొదలైందన్నారు. జీపీఎస్ విధానానికి ఏపీ ఎన్జీవో సంఘం ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
సంయమనంతో పనిచేశారు: సీఎస్
ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కష్టకాలంలో ఉద్యోగులు ఎంతో సంయమనంతో పనిచేశారని అభినందించారు. సమావేశాల్లో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురే‹Ù, జోగి రమేష్, ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment