నేను తొడ కొడితే హరీశ్‌రావుకు హార్ట్‌ఎటాక్‌  | Sangareddy MLA Jagga Reddy Fires On Harish Rao | Sakshi
Sakshi News home page

నేను తొడ కొడితే హరీశ్‌రావుకు హార్ట్‌ఎటాక్‌ 

Published Tue, Feb 16 2021 2:16 AM | Last Updated on Tue, Feb 16 2021 4:39 AM

Sangareddy MLA Jagga Reddy Fires On Harish Rao - Sakshi

సాక్షి, జహీరాబాద్‌: తాను తొడ కొడితే హరీశ్‌రావుకు హార్ట్‌ ఎటాక్‌ వస్తుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కానీ, ఎప్పు డు కొట్టాలో అప్పుడే కొడతానని వ్యాఖ్యానిం చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం సత్వార్‌ గ్రామంలో నిర్వహించిన రైతు ముఖాముఖిలో పాల్గొన్న ఆయన మంత్రిపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌పై కూడా జగ్గారెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు ఎమ్మెల్యేగా, మం త్రిగా అవకాశం ఇచ్చిందన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉండి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలు పట్టించుకొని రుణమాఫీ చేయాలని సీఎంను కోరారు. కాంగ్రెస్‌ పార్టీ హుందా రాజకీయాలు చేస్తుండగా, టీఆర్‌ఎస్‌ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. పోలీసులు, అధికారులు కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement