ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త అరవింద్ కేజ్రీవాల్ సింహంలాంటి వారని, ఆయన్ను ఎక్కువ కాలం జైల్లో పెట్టలేరని అన్నారు.
లోక్‌తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) అంటూ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంపై విపక్ష కూటమి ఇండియా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ జైల్ నుంచి ఓ సందేశం పంపారంటూ సునీతా కేజ్రీవాల్ మాట్లాడారు. ఆ మెసేజ్ గురించి చదివి వినిపించే ముందు మిమ్మల్ని ఓ మాట అడగాలని అనుకుంటున్నాను. ప్రధాని మోదీ నా భర్త కేజ్రీవాల్‌ను జైలుకి పంపారు. ప్రధాని చేసింది సరైందేనా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశ భక్తడు, నిజాయితీ పరుడు అని కొనియాడారు.
#WATCH | INDIA alliance rally: Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "Your own Kejriwal has sent a message for you from jail. Before reading this message, I would like to ask you something. Our Prime Minister Narendra Modi put my husband in jail, did the Prime… pic.twitter.com/aZsdXXvJOO
— ANI (@ANI) March 31, 2024
బీజేపీ నేతల వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ.. జైల్లో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు అంటున్నారు. రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ సింహం లాంటి వారు. ఆయన్ను ఎక్కువ కాలం జైల్లో ఉంచలేరని వ్యాఖ్యానించారు. అనంతరం ప్రజల్ని ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ సభలో చదివి వినిపించారు.
‘కేజ్రీవాల్ అనే నేను నాకు ఓటు వేయాలని మిమ్మల్ని (ప్రజల్ని) కోరడం లేదు. న్యూ ఇండియా కోసం 140 కోట్ల మంది భారతీయుల్ని ఆహ్వానిస్తున్నాను. భారతదేశం వేల సంవత్సరాల నాగరికత కలిగిన గొప్ప దేశం. భారతమాత బాధలో ఉంది. భారత ప్రతిపక్ష కూటమికి ఒక్క అవకాశం ఇస్తే, మేం న్యూ ఇండియాను నిర్మిస్తాం’ అని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని చదివారు. దీంతో పాటు ఇండియా కూటమి తరుపున కేజ్రీవాల్ ఆరుహామీలను ప్రకటించారు. ఆ హామీలను సునీతా కేజ్రీవాల్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment