సాక్షి, న్యూఢిల్లీ: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
హైకోర్టులో ఎందుకు వాదనలు వినిపించలే దని ధర్మాసనం కృష్ణమోహన్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సుందరాన్ని ప్రశ్నించింది. పిటిషనర్ సంతకం ఫోర్జరీ చేసి నోటీసులు అందినట్లు హైకో ర్టును మభ్యపెట్టారని, తామెక్కడా వివరాలు దాచ లేదని సుందరం తెలిపారు. అఫిడవిట్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు అని మాత్రమే ఉందని, సేవింగ్స్ ఖాతా ల గురించి కాదన్నారు. అయితే, సేవింగ్స్ ఖాతాల గురించి వెల్లడించకపోవడం తప్పేనని తెలి పారు.
మొత్తం ఆరు ఖాతాలకు సంబంధించి వివా దం చేశారని అందులో తొలి మూడు వివాదరహిత మని చెప్పారు. వివాదాస్పద రూ.1.80 కోట్లు వ్యవ సాయ భూమికి సంబంధించినవని, ఎన్నికలకు ముందుగానే ఆ భూమి అమ్మి వేసినట్లు వివరించారు. ఎన్నికల చట్టాలకు సంబంధించి అన్ని ఖాతాల వివ రాలు వెల్లడించాల్సిందేనని డీకే అరుణ తరఫు సీని యర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తెలిపారు.
డీకే అరుణను ఎమ్మె ల్యేగా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫి కేషన్ ఇచ్చినట్లు ధర్మాస నం దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఎన్నికల సంఘం, ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ వీలైనంత త్వరగా ఇవ్వాలని రవిశంకర్ కోరగా విచారణ నాలుగు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
వెన్నుపోటు రాజకీయాలు: కృష్ణమోహన్‌రెడ్డి
ప్రజా క్షేత్రంలో గెలవలేకనే ఫోర్జరీ సంతకాలతో వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే కావాలని డీకే అరుణ చూస్తున్నారని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కృష్ణమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు నోటీసులు అందలేని అందుకే హైకోర్టుకు వెళ్లలేదన్నారు. తన సంతకం ఫోర్జరీ చేశారని తెలిసి తమ వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థించినా వినలేదన్నారు. ఎన్నికలకు ముందుగానే కొన్ని భూములు విక్రయించానని, వివరాలు అఫిడవిట్‌లో చూపాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment