చిత్తూరు, సాక్షి: పుంగనూరులో ఇవాళ తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండ కొనసాగింది. టీడీపీ దాడుల్లో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని, సానుభూతిపరుల్ని పరామర్శించేందుకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఆ నియోజకవర్గానికి వెళ్లారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ యత్నించడం, ఆయనపై దాడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది.
మిథున్‌రెడ్డిని అడ్డుకునేందుకు రాళ్ల దాడికి దిగాయి టీడీపీ శ్రేణులు. ఆ కవ్వింపు చర్యలను ప్రతిఘటించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించాయి. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎంపీ గన్‌మెన్ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం ఆయన మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోగా.. పచ్చ పార్టీ కార్యకర్తలు అక్కడా వీరంగం సృష్టించారు.
రెడ్డప్ప ఇంటిపైకి రాళ్లు రువ్వారు. ఆయన కారుకు నిప్పు పెట్టారు. అంతేకాదు.. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. ఈ క్రమంలో 15 కార్లు, పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు రెడ్డప్ప ఇంటి నుంచి కదిలేదే లేదని, తన పర్యటన కొనసాగుతుందని ఎంపీ మిథున్‌రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఏఎస్పీ రెడ్డప్ప నివాసానికి చేరుకుని మిథున్‌రెడ్డితో చర్చలు జరిపారు. చివరకు.. కట్టుదిట్టమైన భద్రత నడుమ పుంగనూరు నుంచి తిరుపతిలోని మారుతినగర్ నివాసానికి ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు తరలించారు.
ఇది హత్యాయత్నమే..
ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ.. దీన్నొక హత్యాయత్నంగా అభివర్ణించింది. మాజీ ఎంపీ రెడ్డప్ప పుంగనూరు ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యయత్నం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ పాలనలో దాడులు ఎక్కువ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్త: ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి
భయపడేది లేదు: మిథున్‌రెడ్డి
పుంగనూరులో గతంలో ఈ తరహా దాడులు ఏనాడూ జరగలేదని, చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్‌లోనే దాడులు జరగుతున్నాయని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, ఇలాంటి దాడులకు మేం భయపడమని ఎంపీ మిథున్‌రెడ్డి అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment