ఇల్లు కావాలి.. రూ.25వేలు కట్టు. రేషన్ కార్డు అవసరం.. రూ.2వేల నుంచి రూ.7వేలు ఖర్చవుతుంది. పింఛన్‌కు అర్హత ఉంది.. అయినా రూ.20వేలు చెల్లించాల్సిందే. రుణం తీసుకోవాలి.. సబ్సిడీలో ఇరవై శాతం మా జేబులో వేయాలి. మరుగుదొడ్డి కట్టుకుంటాం.. నువ్వు కట్టకపోయినా మేం డబ్బులు తీసుకుంటాం. టీడీపీ ఐదేళ్ల పాలనలో పురాల్లో వారు చేసిన పాపాలివి. ప్రతి పనికీ ఓ రేటు పెట్టుకుని పాలన సాగించిన నాటి నేతలు ఇప్పుడు మళ్లీ పీఠం కోసం ఓట్లు అడగడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నాటి పరిస్థితులను ఓటర్లు గుర్తు తెచ్చుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అవినీతి.. అక్రమం. ఈ జోడు గుర్రాలపై ఐదేళ్ల పాటు స్వారీ చేసిన టీడీపీ నేతలు మున్సిపాలిటీల్లో అందిన కాడికి దోచేశారు. తమ పరిధిలో అక్రమాలు సాగిస్తూనే.. వైఎస్సార్‌సీపీ పాలకవర్గం ఉన్న ప్రాంతంలో కూడా చేతివాటం ప్రదర్శించారు. ఏ పథకం మంజూరు చేయాలన్నా ఎంతోకొంత ముట్టజెప్పాలని డిమాండ్ చేసేవారు. అంతేకాదు పసుపు కండువాలు వేసుకున్నోళ్లకు అక్రమంగా ఒంటరి మహిళ పింఛన్లు మంజూరు చేశారు. భర్త బతికుండి, దాంపత్యం జీవితం గడుపుతున్నప్పటికీ భర్త విడిచి పెట్టేశారని చెప్పి ఒంటరి మహిళ పింఛన్లు మంజూరు చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ హయాంలో మున్సిపాలిటీల్లో చేసిన అవినీతికి అంతూపొంతూ ఉండదు. కానీ వారు అంతటితో ఆగలేదు మంజూరైన నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోగా, చేసిన అరకొర పను లు కూడా నాసిరకంగా ముగించి కోట్లాది రూపాయలు మింగేశారు. ఇచ్ఛాపురంలో ఒంటరి మహిళల పింఛన్ల అక్రమాలు, పలాసలో అప్పటి ఎమ్మెల్యే శ్యామసుందర శివాజీ అల్లుడి నిర్వాకాలు, పాలకొండలో నిర్లక్ష్యాలు ఇంకా ఎవరూ మర్చిపోలేదు.
నిధుల ఖర్చులో విఫలం..
జిల్లాలోని మున్సిపాలిటీలకు 14వ ఆర్థిక సంఘం కింద కేంద్రం విడుదల చేసిన నిధులు సక్రమంగా వాడలే దు. జిల్లాలో ని ఐదు మున్సిపా లీ్టలకు రూ. 26కోట్ల 12లక్షల 25వేలు మంజూరు కాగా ఇప్పటివరకు రూ. 8కోట్ల 59లక్షల 80వేలు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా రూ. 17కోట్ల 55లక్షల 45వేలు ఖర్చు చేయకుండా వదిలేశారు. పనుల విషయానికి వస్తే మంజూరైన నిధుల మేరకు 342 పనులు చేపట్టాల్సి ఉండగా కేవలం 132 పనులు మాత్రమే పూర్తి చేశారు. 203 పనులు కనీసం ప్రారంభించలేదు. దీనిపై కలెక్టర్ కూడా ఆరా తీశారు.
నిధుల వినియోగానికి చకచకా అడుగులు
మున్సిపాలిటీల్లో నిధుల వినియోగంలో జాప్యా న్ని గమనించిన కలెక్టర్ జె.నివాస్ తర్వాత ఆ నిధులు ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకున్నా రు. కలెక్టర్ ఆదేశాల మేరకు పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు గుర్తించడంతో పాటు ప్రతిపాదనలు తయారు చేశారు. కలెక్టర్ సిఫార్సుతో మున్సిపల్ డైరెక్టర్ ఆమోదం కూడా తీసుకున్నారు. ప్రస్తుతం వాటి పనులు చకచకా జరుగుతున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఆటవిడుపు, వినోదం, వాకింగ్ తదితర వాటి కోసం ప్రత్యేకంగా పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా చెరువులను సుందరీకరిస్తున్నారు.
ఐదు మున్సిపాలిటీలకు విడుదలైన ఆర్థిక సంఘం నిధులు : రూ. 26,12,25,000
ఖర్చు పెట్టినది : రూ. 8,59,80,000
ఖర్చు కానివి : రూ. 17,55,45,000
ఐదు మున్సిపాలిటీల్లో మంజూరైన పనులు : 342
చేపట్టిన పనులు : 132
ప్రగతిలో ఉన్నవి : 7
ప్రారంభం కానివి : 203
Comments
Please login to add a commentAdd a comment