
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా నియమితులైన సిరికొండ మధుసూదనాచా రి ఆదివారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
అంతకు ముందు మధుసూదనాచారి గన్ పార్కులోని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు.