అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట! | Top10 Telugu Latest News Evening Headlines 26th June 2022 | Sakshi
Sakshi News home page

Telugu Trending News Today: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

Published Sun, Jun 26 2022 4:56 PM | Last Updated on Sun, Jun 26 2022 5:20 PM

Top10 Telugu Latest News Evening Headlines 26th June 2022 - Sakshi

1. భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలుపు
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ డిపాజిట్‌ కోల్పోయారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఆత్మకూరు అఖండ విజయంపై సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌..
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని సీఎం ట్వీట్‌ చేశారు. విక్రమ్‌ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పోలీస్‌ శాఖతో గవర్నర్‌ చర్చలు.. రాష్ట్రపతి పాలన రాబోతోందా?
మహారాష్ట్రలో శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో మొదలైన పొలిటికల్‌ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసినప్పటికీ సీఎం ఉద్దవ్‌ థాక్రే ఈ పోరులో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏక్‌నాథ్‌ షిండే బృందం అసలైన బాల్‌ఠాక్రే వారసులం తామేనని ప్రకటించుకున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఇంటికే వస్తా అంటే రమ్మంటిని.. రాత్రి నుంచి చూస్తున్నా ఎక్కడా?
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్‌ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్‌.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే
మహారాష్ట్రలో పొలిటికల్‌ డ్రామా పలు మలుపులు తిరుగుతోంది. శివసేనకు చెందిన రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సీఎం ఉద్దవ్‌ థాక్రే సర్కార్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. దీంతో, సర్కార్‌ కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. కాగా, పొలిటికల్‌ సంక్షోభం కొనసాగుతున్న వేళ మరో ట్విస్ట్‌ నెలకొంది. సీఎం ఉద్ధవ్‌ థాక్రే భార్య.. రష్మీ థాక్రే రాజకీయ చదరంగంలోకి దిగారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. 30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్‌ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు
ప్రపంచ మాజీ నంబర్‌ 2 టెన్నిస్‌ క్రీడాకారిణి, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఫైనలిస్ట్‌ అయిన ఆండ్రియా జేగర్‌ (అమెరికా) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ స్టాఫ్‌ మెంబర్‌ ఒకరు తనపై 30కి పైగా సందర్భాల్లో లైంగికంగా దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. మావాడికి నేను ఎక్స్‌పోజింగ్‌ చేస్తే నచ్చట్లే, అందుకే ఇలా..
బిగ్‌బాస్‌ షోతో బాగా పాపులర్‌ అయింది రాఖీ సావంత్‌. కానీ ఎప్పుడైతే షో నుంచి బయటకు వచ్చిందో అప్పటినుంచి ఆమెను కష్టాలు వెంటాడాయి. తను ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన వ్యక్తికి ఇదివరకే వివాహమైందని తెలియడంతో ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ కాస్ట్‌ ఎక్కువగా ఉండడం, పాస్‌వర్డ్‌ షేరింగ్‌ అదనపు ఛార్జీలు వసూలు చేస‍్తామని ప్రకటించడంతో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 2లక్షమంది వినియోగదారుల్ని కోల్పోయింది. 30శాతం షేర్లు నష‍్టపోయాయి. క్యూ2లో మరో 20లక్షల వినియోగారుల్ని కోల్పోవచ్చని నెట్‌ఫ్లిక్స్‌ అంచానా వేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి



9. వెండి తెరపై చినుకుల తుళ్లింత
గొప్ప దర్శకులు వానను కూడా పాత్రగా తీసుకున్నారు. ప్రఖ్యాత జపనీస్‌ దర్శకుడు అకిరా కురసావా తీసిన ‘రోషమాన్‌’ సినిమా ప్రారంభంలోనే రోషమాన్‌ నగర శిథిల ద్వారం దగ్గర హోరుమని కురిసే వర్షాన్ని చూపుతాడు దర్శకుడు. ఆ శిథిల ద్వారం, ఆ క్రూర వర్షం 12వ శతాబ్దపు జపనీయ స్థితిగతులకు సంకేతం. 1950లో తీసిన ఈ సినిమాకు ముందు వానను అలా చూపినవారు లేరు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. 30 ఏళ్ల కిందట పేలిన తూటా.. శంకరన్న చేతిలో సరళ బలి
కరీంనగర్‌–నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్‌గా పరిగణిస్తోంది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement