సాక్షి, హైదరాబాద్:/ న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని మార్చాలన్న విషయంలో బీజేపీ ఆలోచననే సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తోందని, ఆ కుట్రకు కేసీఆర్ వంత పాడారన్నారు. కేసీఆర్‌ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశా న్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో రేవంత్ మాట్లాడారు. ‘భూస్వాములు, అగ్ర వర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ మాటలను కేసీఆర్ చెప్పినట్టు ఉంది’ అని అన్నారు. యూపీలో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలు సుపారి తీసుకున్నారని ఆరోపించారు. ఓట్లు చీల్చడానికే ఎంఐఎం యూపీలో పోటీ చేస్తోందన్నారు.
ప్రధానిపై కేసీఆర్ మాటలు సరికాదు
సిద్ధాంత పరంగా ప్రధాని మోదీని వ్యతిరేకించినా, ఆయన గురించి కేసీఆర్ మాట్లాడిన బూతులు పద్ధతి కాదని రేవంత్ అన్నా రు. కేసీఆర్ భాషను సభ్య సమాజం క్షమిం చదని, ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడా రో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌తో దేశ ప్రజలకు ఏమాత్రం మేలు జరగడానికి అవకాశం లేదని, పూర్తిస్థాయిలో నిరాశ పరిచారని విమర్శించారు.
కేసీఆర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నా: కోమటిరెడ్డి
రాష్ట్రం రావడానికి కారణమైన రాజ్యాంగా న్ని రద్దు చేయాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ అసహ నంతో మాట్లాడుతున్నారని, బీజేపీకి వత్తాసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీతో ఫైట్ నాటకమే: జీవన్‌రెడ్డి
కేంద్రం నుంచి నిధులు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణను తిరోగమనంలోకి నెట్టేందుకు టీఆర్‌ఎస్, బీజేపీలు పోటీపడుతున్నాయని వ్యాఖ్యానిం చారు. బీజేపీతో కేసీఆర్ ఫైట్ కేవలం నాట కమేనన్న విషయాన్ని ప్రజలు గ్రహిం చాలన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అనడం సరైంది కాదని, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తొలగించేందుకు కేసీఆర్, మోదీ కుట్రపూరితంగా వ్యవహరి స్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment