‘దమ్ముంటే నీ కన్న తల్లిపై ప్రమాణం చెయ్‌’ | TRS MLA Vinay Bhaskar Fires On Bandi Sanjay | Sakshi
Sakshi News home page

‘దమ్ముంటే నీ కన్న తల్లిపై ప్రమాణం చెయ్‌’

Published Wed, Jan 6 2021 8:37 PM | Last Updated on Wed, Jan 6 2021 9:25 PM

TRS MLA Vinay Bhaskar Fires On Bandi Sanjay - Sakshi

సాక్షి, వరంగల్‌ : గ్రేటర్‌ వరంగల్ మున్సిపాలిటీ  ఎన్నికల దగ్గర పడుతున్న వేళా  బీజేపీ వరంగల్‌లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. వరుసగా బీజేపీ నాయకులు వరంగల్ పర్యటనలు చేసూకుంటూ వరంగల్ అభివృద్ధి  పై విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లో పాటు స్థానిక ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ  అరవింద్ కుమార్, బీజేపీ బండి సంజయ్‌లు వరుస గా పర్యటనలు చేస్తూ బీజేపీ కార్యకర్తల్లో ఊపు తెచ్చి ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా వరంగల్‌లో బీజేపీ  బల పడుతుందనే రీతోలో  కార్యక్రమాలు చేస్తున్నారు.

తాజాగా మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటనలో వరంగల్ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వరంగల్ నగరం ప్రారంభం అయిన కడిపికొండ దగ్గర ఘన స్వాగత పలికిన బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత  ఏర్పాటు చేసిన సమావేశంలో చేరికలు నిర్వహించి బీజేపీ వైపు జనం చూస్తున్నారు అనే భావన తీసుకు వస్తున్నారు. అంతే కాదు సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను సొంతానికి వాడుతున్నారంటూ అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారు అంటూ విమర్శించారు. స్థానికి ఎమ్మెల్యేలపైనా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బండి సంజయ్ విమర్శలను వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. సీఎం కేసీఆర్‎ను విమర్శించే అర్హత బండి సంజయ్‌కు లేదని మండిపడ్డారు. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు పేలితే నాలుక చీరేస్తాం అంటూ బండి సంజయ్‌కు వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.

‘నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే వరంగల్‌లోనే ఉరి వేసుకునే పరిస్థితి తీసుకువస్తాం జాగ్రత్త. మీ నీచ రాజకీయాల కోసం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేయవద్దు. నీకు దమ్ముంటే నిన్ను కన్న నీ తల్లిపై ప్రమాణం చేసి వాస్తవాలు మాట్లాడాలి. మా సవాల్‌ను స్వీకరించు. నీ దగుల్బాజీ వేషాలు నిన్ను కన్న నీ అమ్మకైనా అర్థం అవుతాయి. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ నువ్వు ఎక్కడున్నావ్. ఉద్యమనేత కేసీఆర్‌ను విమర్శించే అర్హత నీకు లేదు. కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలిస్తే నాలుక చీరేస్తాం. బీజేపీ నేతలు ఖబడ్దార్. పునర్విభజన చట్టంలో హామీలు ఏమయ్యాయ్. బ్రోకర్ బండి సంజయ్ అబద్దాలు ప్రచారం చేస్తే.. నిన్ను ప్రజలు బట్టలిప్పి కొడతారు. వారణాసిలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. నువ్వు బండి సంజయ్ కాదు.. అబద్దాల సంజయ్. సంజయ్ ముచ్చట్లు చెబితే వరంగల్ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీకి నువ్వు అధ్యక్షుడివని గుర్తుపెట్టుకో' అని బండి సంజయ్‌పై వినయ్‌ భాస్కర్‌ విరుచుకుపడ్డారు. ఇటు బీజేపీ నేతలు విమర్శలు. అటు టీఆర్ఎస్ నేతల వార్నింగ్స్ తో జిల్లాలో ఒక్కసారి  పొలిటికల్ హీట్ పెరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement