రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు: కిషన్‌రెడ్డి | Union Minister Kishan Reddy Comments On CM Revanth Reddy, Watch Video Inside | Sakshi
Sakshi News home page

రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు: కిషన్‌రెడ్డి

Published Sun, Nov 17 2024 10:05 AM | Last Updated on Sun, Nov 17 2024 11:24 AM

Union Minister Kishan Reddy Comments On Cm Revanth Reddy

సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాంనగర్‌లోనే గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లు మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటే వేలాది ఇళ్లు కూల్చేయాల్సి వస్తుందన్నారు.

‘‘కోటిమంది డ్రైనేజీ నీళ్లు మూసీలో వెళ్తుంది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. సీఎం ముందుగా చేయాల్సిన పని కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయండి. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారు ?. మూసీ డీపీఆర్‌ ఎప్పుడు పూర్తవుతుంది?. కృష్ణా నీళ్ళు తెస్తారా?. గోదావరి నీళ్లు తెస్తారా?. లక్షా యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారా?

..రేవంత్ పాలన ఏడాది పూర్తయ్యింది. డీపీఆర్‌ రావడానికి రెండేళ్లు పడుతుంది. ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్‌లో దుర్గంధం వాసన రావడం లేదు. పేదల నివాసం ఉంటున్న ఇళ్లపై రేవంత్ కన్ను పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. పేదల జోలికి వెళ్లకుండా పునర్జీవం చేయండి. మూసీ ప్రక్షాళన అనే వార్త వింటేనే భయంతో వణికిపోతున్నారు. కక్ష పూరితంగా వ్యవహరించవద్దు. హుస్సేన్ సాగర్‌లో కొబ్బరినీళ్లు చేస్తానన్న కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కి వెళ్లాడు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలి’’ కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

..మహారాష్ట్రలో తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేయండి. నల్లగొండ రైతులకు న్యాయం చేయండి. నిజాం రిటైనింగ్ వాల్ కట్టినట్లు హై కోర్టు దగ్గర ఆనవాళ్లు ఉన్నాయి. రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తేనే పూర్తికాలం సీఎం గా రేవంత్ పనిచేస్తారు’’ అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement