హిందూ వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలి
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ‘ఎక్స్’వేదికగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: వివిధ హిందూ సంస్థల కార్యకర్తల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హిందూ సంస్థల పట్ల, ఆ సంస్థల కార్యకర్తలపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కిషన్‌రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఇది కుట్రా? లేక ద్వేషమా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని హిందూ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి’అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
‘ముందుగా...భారతీయ న్యాయసంహిత సెక్షన్ 176, సెక్షన్ 173 నిబంధన కింద 3 క్రిమినల్ కేసులకింద ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు..సోమవారం అర్ధరాత్రి సమయంలో..ఆ ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేసి సెక్షన్ 109 (హత్యాయత్నం)ను చేర్చారు. ఇది హిందూ సంస్థల సభ్యులను హింసించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనను తెలియజేస్తోంది’అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment