కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బుల్డోజర్లు దింపే అధికారం ప్రభుత్వానికి లేదు
ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం
సాక్షి, హైదరాబాద్: పేదవాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలమీద ప్రతాపం చూపిస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామన్నారు. పేదవాళ్ల ఇళ్లపై బుల్డోజర్లు దింపే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. సమగ్రమైన ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనలు, మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గురువారం పార్టీనేతలు ప్రేమ్‌సింగ్ రాథోడ్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్.కుమార్, ఎస్.ప్రకాశ్‌రెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా పేదలకు మేలు చేసే ప్రయత్నంతోపాటు ప్రాజె క్టులు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బస్తీలపై కన్నేసి, ఆ ఇళ్లను కూల్చే పనికి శ్రీకారం చుట్టిందని, ఇలా దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేయలేదన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి, పేదల ఇళ్లపై మార్కింగ్ చేయడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైందని, దాంతో వెనకడుగు వేసిందని గుర్తుచేశారు. హైదరాబా ద్‌లోని 70 శాతం డ్రైనేజీ నీరంతా మూసీలో చేరుతోందని, ప్రతీగల్లీలో డ్రైనేజీ సమస్య నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకుండా రూ.లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ పేరుతో అనాలోచిత చర్యలకు పాల్పడుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
‘అనేక చెరువుల్లో బడాబాబులు, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు ఫామ్‌హౌస్‌లు, ఎస్టేట్‌ల పేరుతో నిర్మాణాలు చేసుకున్నారు. ముందు వారిపై హైడ్రా ప్రతాపం చూపాలి. దమ్ముంటే అక్రమంగా నిర్మించుకున్న ఒవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి’అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై..
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై విలేకరులు స్పందన కోరగా.. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేవలం రాజకీయ ప్రయోజనాలు, ప్రత్య ర్థులపై విమర్శల కోసం ఇతరుల కుటుంబ వ్యవహారాలు, మహిళల వ్యక్తిగత విషయా లను వాడుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ‘అలాంటి నీచ సంస్కృతిని కేసీఆర్ మొదలు పెట్టారు.
కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. నేడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనసా గిస్తు న్నారు’అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేస్తు న్న తప్పులకు ఆ పార్టీలను బహిష్కరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ‘కేసీఆర్ సర్కార్ గతంలో ఫోన్ ట్యాపింగ్‌తో సినీ ప్రము ఖులు, వ్యాపారస్తుల వ్యక్తిగత విషయాలను తెలుసుకుని, వారిని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసు అధికారులే చెప్పారు’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment