
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. '20 మంది ఎమ్మెల్యేలా..? లేక.. బినామీల పేరిట కొన్న భూములకు లక్ష కోట్లా.. అన్న ప్రశ్నకు,. ఎమ్మెల్యేలు పోతే పోయారుగానీ.. లక్ష కోట్లే కావాలని బాబు అంటున్నాడు. బాబు దృష్టిలో అమరావతి ఎంతో "విలువైనది"! అంటూ పేర్కొన్నారు. (అమరావతిపై ఇక నివేదికలిస్తా: చంద్రబాబు)
కాగా మరో ట్వీట్‌లో.. 'వైరస్ వ్యాప్తి లేనప్పుడు స్థానిక ఎన్నికలకు భయపడిన బాబు.. ఇప్పుడు వైరస్ వ్యాప్తి వున్న సమయంలో మళ్ళీ ఎన్నికలని ఛాలెంజ్ విసురుతున్నాడు. సవాల్ సిల్లీగా వున్నా.. ప్రజల భద్రతపై నారావారి నిబద్దత ఏంటో అర్ధమైపోయింది. తన స్వార్ధం కోసం దేనికైనా తెగించే డెడ్లీ పొలిటికల్ వైరస్ నారానిప్పు' అంటూ చురకలంటించారు. (రాజధానులపై చంద్రబాబు డ్రామా)
Comments
Please login to add a commentAdd a comment