సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'ప్రపంచంలోనే అతిపెద్ద పాల సొసైటీ అమూల్‌ను వైఎస్ జగన్ గారు రాష్ట్రానికి ఆహ్వానిస్తే బాబుకి నిద్ర పట్టడం లేదు. విష ప్రచారాలు మొదలు పెట్టించాడు. హెరిటేజ్ కోసం విజయా డెయిరీని ఖతం చేశాడు. సేకరణ ధర పెరుగుతుందని పాడి రైతులు మురిసిపోతుంటే తనేమో పొర్లిపొర్లి ఏడుస్తున్నాడు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (ఆ లాజిక్‌ను చంద్రబాబు ఎప్పుడో గాలికొదిలారు!)
మరో ట్వీట్‌లో.. 'భారీ ప్రాజెక్టులన్నీ చాలా ఏళ్ల తర్వాత నిండు కుండల్లా జలశోభను సంతరించుకున్నాయి. శ్రీశైలం, సోమశిల క్రెస్టు గేట్లు ఇంకా తెరుచుకునే ఉండగా, కండలేరు పూర్తి కెపాసిటీకి దగ్గరవుతోంది. మీడియం ఇరిగేషన్ డ్యాంలన్నీ వరద నీటితో కళకళలాడుతున్నాయి. మరో రెండేళ్ల పాటు నీటికి ఢోకా లేదు' అని పేర్కొన్నారు. (48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి రూ.5 వేలు)
Comments
Please login to add a commentAdd a comment