Heritage Dairy
-
పాడిరైతును చితగ్గొట్టి 'హెరిటేజ్‌కు మిల్క్‌షేక్'!
రోజుకు రూ.326 నష్టంఅనంతపురం జిల్లా రోటరీపురానికి చెందిన ఎర్రి స్వామి రోజూ 14 లీటర్ల పాలు అమూల్ కేంద్రానికి పోసేవారు. లీటర్ ఆవు పాలకు రూ.43 చొప్పున ఆరు లీటర్లకు రూ.258, గేదె పాలకు లీటర్ రూ.83 చొప్పున ఎనిమిది లీటర్లకు రూ.664 కలిపి.. మొత్తం రూ.922 ఆదాయం లభించేది. ఇప్పుడు ఈ కేంద్రం మూతపడింది. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీలు ధర తగ్గించడంతో ఆవు పాలు లీటర్ రూ.30, గేదె పాలు రూ.52కి అమ్ముకోవాల్సి వస్తోంది. అంటే ఆవు పాలు లీటర్‌కు రూ.13 నష్టం, గేదె పాలు లీటర్‌కు రూ.31 నష్టం. ఫలితంగా రోజూ రూ.326 చొప్పున నష్టపోతున్నట్లు స్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.ఒక్క గ్రామంలోనే రూ.1.34 లక్షలు నష్టం..అనంతపురం జిల్లా రోటరీపురంలో నిత్యం 16 మంది రైతులు 160 లీటర్ల ఆవు పాలు, 80 లీటర్ల గేదె పాలు జగనన్న పాలవెల్లువ కేంద్రానికి పోసేవారు. గేదె పాలకు లీటర్‌కు గరిష్టంగా రూ.84, ఆవు పాలకు రూ.43 చొప్పున దక్కేది. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ కేంద్రం మూతపడింది. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యక్తులకు పాలు పోస్తుండటంతో లీటర్ ఆవు పాలకు రూ.30, గేదె పాలకు రూ.54 చొప్పున ఇస్తున్నారు. ఫలితంగా లీటర్‌పై ఆవుపాలకు రూ.13 చొప్పున రూ.2,080, గేదె పాలకు రూ.30 చొప్పున రూ.2,400లను ఈ గ్రామ పాడిరైతులు రోజూ నష్టపోతున్నారు. ఒక్క ఈ గ్రామంలోనే రోజుకు రూ.4,480 చొప్పున నెలకు రూ.1.34 లక్షలకు పైగా ఆదాయాన్ని పాడి రైతులు కోల్పోతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన అమూల్ పాల కేంద్రాలతో ప్రతి నెలా రూ.100 కోట్లకు పైగా నష్టపోతున్నారు. పాలసేకరణ ధరలు దారుణంగా తగ్గిపోవడం వల్ల ప్రైవేట్ డెయిరీలకు పాలుపోసేవారు మరో రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టపోతున్నారు.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ డెయిరీల దోపిడీ మళ్లీ మొదలైంది. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో పాల సేకరణ ధరలు గణనీయంగా తగ్గిపోయి పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఒకపక్క పాడి పశువుల ధర రూ.లక్షల్లో ఉంది. మరోపక్క పెరుగుతున్న దాణా ఖర్చులతో పోషణ భారంగా మారింది. ఇలాంటి సమయంలో పాడి రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాల్సిన ప్రభుత్వ పెద్దలు వారి పొట్టగొడుతున్నారు. తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో గతంలో ఆవు పాలకు లీటర్‌కు రూ.30 నుంచి రూ.38 మధ్య చెల్లించిన హెరిటేజ్ డెయిరీ ప్రస్తుతం రూ.23 నుంచి రూ.31కి మించి చెల్లించడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక గేదె పాలకు గతంలో రూ.40–రూ.50 వరకు చెల్లించిన హెరిటేజ్... తాజాగా రూ.35 నుంచి రూ.40కి మించి ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. అదే సమయంలో కాకినాడ జిల్లాలో సోమవారం అమూల్‌కు పాలుపోసిన రైతులకు గేదెపాలకు లీటరుకు గరిష్టంగా రూ.92–93, ఆవు పాలకు రూ.39–40 చెల్లించింది. ఇలా జగనన్న పాలవెల్లువ కేంద్రాల (అమూల్) ద్వారా దాదాపు నాలుగేళ్లపాటు లాభాలతో పొంగిపోయిన రాష్ట్రంలోని పాడి రైతులు కూటమి సర్కారు కక్షపూరిత చర్యలతో ఇప్పుడు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 11 జిల్లాల్లో ఈ కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలిన జిల్లాల్లో కూడా సేకరణ అంతంత మాత్రంగానే పాక్షికంగా సాగుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రైవేట్ డెయిరీల దోపిడీతో పాలకు గిట్టుబాటు ధర లభించక, బ్యాంకు రుణాలు తీర్చే దారి కానరాక రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల పాడి రైతు కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయాయి. గతంలో చంద్రబాబు హయాంలో పులివెందుల, చిత్తూరుతో సహా 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. డెయిరీల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర, ప్రైవేట్ డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం సహకార రంగంలో దేశంలోనే నెం.1గా ఉన్న అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాడి రైతులను ఆదుకుంది.అమూల్ రాకతో పాల విప్లవం.. ఎనిమిది సార్లు సేకరణ ధర పెంపుఅమూల్ తొలుత మూడు జిల్లాల్లో ప్రారంభమై 19 జిల్లాలకు విస్తరించింది. 400 గ్రామాల నుంచి 4,798 పల్లెలకు చేరుకుంది. 2020 అక్టోబర్‌లో 10 శాతం వెన్నతో లీటర్ ఆవు పాలకు రూ.25–28, గేదె పాలకు రూ.56–60 చొప్పున ప్రైవేట్ డెయిరీలు చెల్లించగా, అమూల్ ప్రారంభంలోనే 11 శాతం వెన్న, 9 శాతం ఘన పదార్థాలు (ఎస్ఎన్ఎఫ్)తో గేదె పాలకు లీటర్ రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించింది. ఆ తర్వాత వరుసగా 8 సార్లు పాలసేకరణ ధరలను పెంచి గేదె పాలకు రూ.89.76, ఆవుపాలకు రూ.43.69 చొప్పున చెల్లించింది. ఇలా 40 నెలల్లో గేదెపాలకు లీటర్‌పై రూ.18.29, ఆవుపాలపై రూ.9.49 చొప్పున పెంచడంతో లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూరుస్తామన్న హామీ కంటే మిన్నగా గేదె పాలపై రూ.15–20, ఆవు పాలపై రూ.10–15 వరకు అదనంగా లబ్ధి చేకూర్చింది.రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధర..గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో వెన్న శాతాన్ని బట్టి కాకినాడ జిల్లాలో గేదె పాలకు లీటర్‌కు రూ.112, ఆవు పాలకు లీటర్‌కు రూ.53.86 చొప్పున అమూల్‌కు పాలుపోసిన రైతులకు దక్కిన దాఖలాలున్నాయి. వెన్న శాతాన్ని బట్టి లెక్కగట్టి అణా పైసలతో సహా ప్రతి 10 రోజులకోసారి రైతుల ఖాతాలో జమ చేసేవారు. లీటర్‌కు ఏటా రూ.2–5 పెంచడమే గగనంగా ఉండే ప్రైవేట్ డెయిరీలు అమూల్ పోటీని తట్టుకోలేక గేదె పాలకు లీటర్‌పై రూ.14, ఆవు పాలపై రూ.7 వరకు సేకరణ ధర పెంచక తప్పలేదు. ప్రైవేట్ డెయిరీలతో పోలిస్తే అమూల్ పాల సేకరణ ధరలు 10 శాతం అధికంగానే ఉండేవి. సీజన్‌తో సంబంధం లేకుండా వెన్న, ఘన పదార్థాల శాతాన్ని బట్టి అమూల్ ఒకే రీతిలో చెల్లించి పాడి రైతులకు మేలు చేసింది.80 శాతం కేంద్రాలు మూతగతంలో 19 జిల్లాలకు విస్తరించిన అమూల్ పాలసేకరణ కూటమి సర్కారు సహాయ నిరాకరణతో ప్రస్తుతం ఎనిమిది జిల్లాలకే అది కూడా పాక్షిక సేకరణకు పరిమితమైంది. 4,798 కేంద్రాల్లో జరిగిన పాల సేకరణ వెయ్యి కేంద్రాలకు తగ్గిపోయింది. ఐదు నెలల క్రితం అమూల్‌కు పాలు పోసే వారి సంఖ్య రోజుకు సగటున 1.25 లక్షలు ఉండగా నేడు 20 వేలకు క్షీణించింది. ఇదే సమయంలో పాల సేకరణ 3.95 లక్షల లీటర్ల నుంచి 1.30 లక్షల లీటర్లకు తగ్గిపోయింది.కుటుంబ సంస్థకు మేలు చేసేందుకే..సీఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టింది మొదలు సొంత డెయిరీకి మేలు చేస్తూ అమూల్‌ను నీరుగార్చే చర్యలకు శ్రీకారం చుట్టారు. నాలుగు దశాబ్దాల క్రితం సహకార సమాఖ్యగా ఏర్పడిన విజయ డెయిరీ నిలదొక్కుకునేందుకు ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) దాదాపు దశాబ్దం పాటు చేయూతనిచ్చింది. పాలసేకరణ, రైతుకు మద్దతు ధర, పాల ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చారు. అదే రీతిలో అమూల్‌కు చేయూత నిచ్చేందుకు నియమించిన సిబ్బందిని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన రెండో రోజే వెనక్కి రప్పించింది. అంగన్వాడీ కేంద్రాలకు రోజూ 50 వేల లీటర్ల పాల సరఫరా బాధ్యతల నుంచి సైతం అమూల్‌ను తప్పించింది. దీంతో సేకరణ కేంద్రాలను మూసివేసే దిశగా అమూల్ అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత అనంతపురం, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో కేంద్రాలను నిలిపి వేసిన అమూల్ అనంతరం గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల సహా 11 జిల్లాల్లో పాలసేకరణను నిలిపి వేసింది. మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా సేకరణ జరుగుతోంది. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలను తగ్గించేయడంతో గ్రామీణ మహిళా పాడి రైతుల జీవనోపాధికి గండి పడింది. హెరిటేజ్ సహా ప్రధాన ప్రైవేటు డెయిరీలన్నీ పాల సేకరణ ధరలను లీటర్‌పై సగటున ఆవు పాలకు రూ.10–20, గేదె పాలకు రూ.15 నుంచి రూ.30 వరకు తగ్గించేశాయి. తాము చెప్పిందే ధర, ఇచ్చిందే తీసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నాయి. వెన్న, ఎస్ఎన్ఎఫ్ శాతాలతో సంబంధం లేకుండా 15 రోజులకోసారి సగటు ధర నిర్ణయిస్తుండడంతో ఒక్కో పాడి రైతు సగటున రోజుకు రూ.100–500 వరకు నష్టపోతున్నారు.గత ప్రభుత్వం పాడి రైతులను ఆదుకుందిలా..180 రోజుల పాటు పాలుపోసే వారికి లీటర్‌కు రూ.0.50 చొప్పున బోనస్ రూపంలో రూ.6.50 కోట్ల అదనపు లబ్ధి చేకూర్చడమే కాకుండా లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఫీడ్ పంపిణీ చేశారు. వర్కింగ్ క్యాపిటల్ రూపంలో గేదెకు రూ.30 వేలు, ఆవుకు రూ.25 వేల చొప్పున, కొత్త పాడి కొనుగోలుకు గేదెకు రూ.93 వేలు, ఆవులకు రూ.76 వేల చొప్పున ఆర్ధిక చేయూతనిచ్చారు. ఒక్కొక్కటి రూ.12.81 లక్షల అంచనా వ్యయంతో 11,800 పాల సేకరణ కేంద్రాలు (ఏఎంసీయూ), ఒక్కొక్కటి రూ.20.42 లక్షల అంచనాతో 4,796 పాల శీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ) నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూతపడిన మదనపల్లి డెయిరీని అమూల్ సహకారంతో పునరుద్ధరించారు. చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చి రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమూల్‌కు లీజుకిచ్చారు. రూ.70 కోట్లతో రోజుకు లక్ష లీటర్ల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు.ప్రతి నెలా బోనస్ వచ్చేదిఅమూల్ కేంద్రానికి రోజూ 9 లీటర్లు పాలు పోశాం. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి గరిష్టంగా లీటర్‌కు రూ.85–95 వరకు ఇచ్చేవారు. ప్రతి నెలా బోనస్ వచ్చేది. పది రోజులకోసారి బ్యాంక్ ఖాతాలో సొమ్ములు జమ చేసేవారు. అమూల్ కేంద్రం మూతపడడంతో ప్రెవేట్ డెయిరీకి పోయాల్సి వస్తోంది. ఎస్ఎన్ఎఫ్ శాతం ఎంత ఉన్నా లీటరుకి రూ.75కి మించి రావడం లేదు. సగటున రోజుకి రూ.100కిపైగా నష్టపోతున్నా. – ఎనుముల పవనకుమారి, పోతవరం, ప్రకాశం జిల్లా.పట్టించుకోకపోవడం దారుణంఅమూల్ కేంద్రానికి పూటకు 4 లీటర్లు పాలు పోసేవాళ్లం. గేదె పాలు లీటర్‌కు రూ.70కు పైగా వచ్చేది. ఇప్పుడు అమూల్ కేంద్రం మూతపడటంతో ప్రైవేట్ డెయిరీలు రూ.30కి మించి ఇవ్వడం లేదు. బ్యాంక్ రుణాలు ఎలా చెల్లించాలో తెలియడం లేదు. అమూల్ కేంద్రాలు మూతపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. – ఎం.భారతి, సముదాయం, తిరుపతి జిల్లామళ్లీ బెంగళూరు వలస వెళ్లాల్సిందే...రోజూ 32 లీటర్ల పాలు అమూల్‌కు పోసేవాళ్లం. లీటరుకు రూ.42 చొప్పున రోజుకు రూ.1,300కిపైగా వచ్చేవి. రెండు రోజులుగా శ్రీజ డెయిరీకి పోస్తున్నా. ఇప్పుడు రోజుకు రూ.900 కూడా రావడం లేదు. అమూల్ ద్వారా మహిళా సహకార సంఘంలో నాలుగు ఆవులను రూ.2 లక్షల లోన్‌పై తీసుకున్నా. రుణ వాయిదాలు ఎలా చెల్లించాలో దిక్కు తోచడం లేదు. ఇలాగైతే పాడిని అమ్ముకోవడం మినహా గత్యంతరం లేదు. పాడి రైతులంతా గతంలో మాదిరిగా బెంగళూరు వలస వెళ్లాల్సిందే. – శశికళ, కౌలేపల్లి, శ్రీసత్యసాయి జిల్లాజగన్పై కోపాన్ని మాపై చూపిస్తున్నారు..రోజూ 20 లీటర్ల వరకు పాలు పోస్తాం. ఈ ఏడాది ఏప్రిల్, మే వరకు ఆవు పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.44, గేదె పాలకు గరిష్టంగా రూ.67 వరకు లభించింది. అత్తమీద కోపం దుత్తపై చూపినట్లు జగన్‌పై కోపాన్ని పాడి రైతులపై చూపిస్తున్నారు. ఇలాగైతే పాడి పశువులను అమ్ముకోవాల్సిందే. – పి.ఉమా, కురబాలకోట, అన్నమయ్య జిల్లాఇదే పరిస్థితి ఉంటే పాడిని వదిలేస్తాంవెన్న శాతాన్ని బట్టి గతంలో లీటరుకి రూ.82 వచ్చేది. ప్రస్తుతం వెన్న శాతం ఎంత ఉన్నా రూ.72కు మించి ఇవ్వడం లేదు. గతంలో రూ.80–100 ఉండే ఒక బొద్దు ఎండు గడ్డి ప్రస్తుతం రూ.120 చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. గేదెలకు ఎండు గడ్డి వేయకపోతే వెన్న శాతం పెరగదు. తవుడు కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. జగన్ హయాంలో పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించింది. ఇప్పుడు ప్రైవేటు డెయిరీలు పాలసేకరణ ధరలను దారుణంగా తగ్గించేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పాడిని వదిలేస్తాం. – ఎం.బ్రహ్మయ్య, రాళ్లపాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లామేం రోడ్డున పడ్డాం..అమూల్ కోసం మహిళా పాల సహకార సంఘం ద్వారా రోజూ 480 లీటర్ల వరకు సేకరించేవాడ్ని. లీటర్‌కు రూ.1.25 చొప్పున నెలకు రూ.18 వేలు కమిషన్ వచ్చేది. ఆ డెయిరీ మూత పడడంతో రోడ్డున పడ్డాం. ఆవులను అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అమూల్ కేంద్రాలు మూతపడకుండా చూడాలని వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. – చంద్రమోహన్, కొండకమర్ల, శ్రీసత్యసాయి జిల్లా -
హెరిటేజ్ కోసం పాడి పరిశ్రమను - రైతులను నట్టేట ముంచారు
-
చంద్రబాబు చంపేసిన చిత్తూరు డెయిరీకి పునరుజ్జీవం
సాక్షి, అమరావతి: దేశంలోనే రెండో అతిపెద్ద పాల కర్మాగారంగా పేరొందిన చిత్తూరు విజయా డెయిరీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శంకుస్థాపన తర్వాత 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిత్తూరు డెయిరీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం 1945లో చిల్లింగ్ ప్లాంట్‌గా ఏర్పడగా, 1969లో పూర్తి స్థాయి డెయిరీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రోజుకు 2 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో 1988లో చిత్తూరు జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌గా ఏర్పడింది. జిల్లాలోని మొత్తం డెయిరీ కార్యకలాపాలను దాని పరిధిలోకి తీసుకొచ్చారు. డెయిరీకి అనుబంధంగా పిచటూర్, శ్రీకాళహస్తి, మదనపల్లి, వి.కోట, పీలేరులో మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 1988–93 మధ్య చిత్తూరు డెయిరీ సగటున రోజుకు 2.5 – 3 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే స్థాయికి చేరుకుంది. తిరుమల శ్రీవారి ఆలయానికి పాల ఉత్పత్తుల సరఫరాలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు చిత్తూరు డెయిరీకి అనుబంధంగా నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ద్వారా తిరుపతిలో 1992–93లో లక్షన్నర లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంలో బాలాజీ డెయిరీని ఏర్పాటు చేశారు. హెరిటేజ్ కోసం నిర్వీర్యం సరిగ్గా అదే సమయంలో హెరిటేజ్ డెయిరీ పురుడు పోసుకుంది. చంద్రబాబునాయుడు తన డెయిరీ హెరిటేజ్ కోసం లాభాల్లో దూసుకుపోతున్న చిత్తూరు డెయిరీని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడం మొదలు పెట్టారు. ఆర్థిక నష్టాలకు గురిచేసి, చివరికి రైతులకు కూడా చెల్లింపులు చేయలేని స్థితికి తీసుకొచ్చారు. చెప్పాపెట్టకుండా 2002 ఆగష్టు 31న ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మూత వేశారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు రూ.వందల కోట్లు బకాయి పెట్టారు. 2003 నవంబర్ 27న లిక్విడేషన్ ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2008లో మదనపల్లి చిల్లింగ్ యూనిట్‌ను పాక్షికంగా పునఃప్రారంభించగా, ఆ తర్వాత వచ్చిన పాలకుల నిర్వాకంతో మళ్లీ మూత పడింది. ప్రస్తుతం చిత్తూరు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి యూనియన్ లిక్విడేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు రోజుకు 1.5 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో లాభాల్లో నడుస్తున్న బాలాజీ డెయిరీకి చెల్లించాల్సిన బకాయిలు ఎగ్గొట్టడంతో ఎన్డీడీబీకి అప్పగించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. దీని నిర్వహణా బాధ్యతలను ఎన్డీడీబీ శ్రీజ డెయిరీకి అప్పగించగా, ప్రస్తుతం 3 లక్షల లీటర్ల సామర్థ్యానికి విస్తరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీ పునరుద్దరణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుంబిగించారు. రాష్ట్రంలో సహకార డెయిరీలకు పూర్వవైభవం తీసుకు రావాలన్న సంకల్పంతో ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (అమూల్)తో చేసుకున్న విషయం తెలిసిందే. జగనన్న పాల వెల్లువ పథకం కింద ఇప్పటికే 3.07 లక్షల మందితో 3,551 మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాల సేకరణ ద్వారా రూ.393 కోట్లు చెల్లించారు. అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాల సేకరణ ధర వల్ల ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.3,754 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. వీరి కోసం గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా 4,796 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు నిర్మిస్తున్నారు. మరో వైపు మూత పడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రీ ప్యాకింగ్, ప్రాసెసింగ్, అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్రీ ప్యాకింగ్, యూహెచ్‌టీ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా మదనపల్లి యూనిట్‌ను పునరుద్ధరించారు. 2021 నుంచి దీన్ని అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. అమూల్ రూ.385 కోట్ల పెట్టుబడులు చిత్తూరు డెయిరీని పునరుద్ధరించడం ద్వారా పాడి రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు హెరిటేజ్ ఫుడ్స్‌కు బలమైన పోటీదారుగా నిలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే లక్ష్యంతో డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం అమూల్ సంస్థ ద్వారా రూ.385 కోట్ల పెట్టుబడులు పెట్టిస్తోంది. తొలుత రూ.150 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీరు, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు యూహెచ్‌టీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. డెయిరీ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. శంకుస్థాపనకు ఏర్పాట్లు 2002లో మూత పడిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్‌తో ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. జూలై 4వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయబోతున్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్నాం చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నాం. లాభాల్లో నడిచిన ఈ డెయిరీని కావాలనే నాశనం చేశారు. ఈ డెయిరీ మూత పడడంతో ప్రైవేటు డెయిరీలకు పాలు పోయాల్సి వచ్చేది. నాకు ఐదు ఆవులున్నాయి. రోజుకు 18–20 లీటర్ల పాలు పోస్తుంటా. గతంలో లీటర్‌కు రూ.20కి మించి వచ్చేది కాదు. అమూల్ రాకతో ప్రస్తుతం రూ.43 వస్తోంది. నిజంగా చాలా ఆనందంగా ఉన్నాం. డెయిరీ పునరుద్ధరణతో ఈ ప్రాంత పాడి రైతులందరికీ మేలు జరుగుతుంది. – ఎం.చిట్టిబాబు, జి.గొల్లపల్లి, తవనంపల్లి మండలం, చిత్తూరు జిల్లా -
హెరిటేజ్ కోసమే ‘ఈనాడు’ తప్పుడు కథనాలు.. చంద్రబాబు బాగోతం మరిచారా?
బద్వేలు అర్బన్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ డెయిరీ కోసమే ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నదని విజయా డెయిరీ చైర్మన్ ఎస్.వి.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఈనాడు దినపత్రికలో ‘సర్వం అమూల్ పాలు’ అంటూ మంగళవారం ప్రచురించిన కథనంపై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 సహకార డైరీలను చంద్రబాబునాయుడు తన హెరిటేజ్ సంస్థ కోసం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పాడిరైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి కో–ఆపరేటివ్ సంస్థ అయిన అమూల్‌ను రాష్ట్రానికి తీసుకురావడంతో పాడిరైతులకు ఇప్పటి వరకు రూ.2 వేల కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. అయినా ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించడం సిగ్గుచేటని చెప్పారు. అభివృద్ధి దిశగా విజయా డెయిరీ.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైఖరితో నష్టాల్లో కూరుకుపోయిన విజయా డెయిరీని సీఎం జగన్ ఆదేశాలతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని ఆ డెయిరీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నెలకు రూ.5 లక్షలు లోపు ఆదాయం ఉన్న డెయిరీని నేడు కోటి రూపాయల ఆదాయం వచ్చేలా చేశామని, ఇందుకు ప్రభుత్వ సహకారం ఎంతగానో ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు మేలు జరిగిందా, ప్రస్తుత జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగిందా అన్న విషయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈనాడు అధినేత రామోజీరావులు కాణిపాకం వినాయకుని సన్నిధిలో గానీ, తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో గానీ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. అడా చైర్మన్ గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హెరిటేజ్ దోపిడీ వెలుగు చూస్తుందనే టీడీపీ పరార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాదిమంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే అమూల్ సహకార సంస్థ అంశం శుక్రవారం శాసనసభలో చర్చకు రాకుండా ప్రతిపక్ష టీడీపీ విశ్వప్రయత్నం చేసింది. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుపై తామిచ్చిన వాయిదా తీర్మానంపైనే చర్చ జరగాలని ఆ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. టీడీపీ పాలనలో ఈ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతున్నందున చర్చకు అనుమతించలేమని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేసినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఈ వైఖరిపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ అమూల్ అంశం చర్చకొస్తే చంద్రబాబునాయుడికి సంబంధించిన హెరిటేజ్ మోసాలు వెలుగుచూస్తాయని టీడీపీ భయపడుతోందని విమర్శించారు. ఈ కారణంగానే సభ నుంచి పారిపోయేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అందుకే సభ్యులను స్పీకర్ వెల్‌లోకి పంపి గొడవ చేయిస్తన్నాడని ధ్వజమెత్తారు. ఒకసారి వాయిదాపడ్డ సభ మళ్లీ ప్రారంభంకాగానే టీడీపీ సభ్యులు ఏకంగా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడమే కాకుండా, స్పీకర్ స్థానం వైపు దూసుకెళ్లి దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు. సస్పెన్షన్ బాధ కలిగిస్తోంది ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో విపక్ష సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో చంద్రబాబునాయుడు లేకపోయినా ఆయన సభనుంచి వెళ్లిపోవడాన్ని వైఎస్సార్ సీపీ సభ్యులు తప్పుబట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అతి ముఖ్యమైన అంశాలపై చర్చించకుండా విపక్షం రాజకీయ కోణంలో వెళ్లడం హేయమైన చర్య అని అభివర్ణించారు. స్పీకర్ స్థానం వద్దకు రావడం బాధాకరమన్నారు. సస్పెండ్ చేసిన తర్వాత తానెంతో మనోవేదనకు గురవుతున్నానని, నిద్ర కూడా పట్టడం లేదని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో సస్పెండ్ చేయాల్సి వస్తోందన్నారు. మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన్ని మోస్తున్న ఎల్లో మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల వచ్చినప్పుడు కూడా ఎల్లో మీడియా తనను కేంద్రంగా చేసుకుని తప్పుడు వార్తలిచ్చిందని చెప్పారు. -
సహకార డెయిరీలను ముంచేసి హెరిటేజ్‌కు ధనార్జన
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో సహకారరంగాన్ని కుట్రతో నాశనం చేసి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ అడ్డగోలు దోపిడీకి మార్గం సుగమం చేశారని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. తద్వారా హెరిటేజ్ డెయిరీకి ఏకంగా ఏడాదికి రూ.1,277.5 కోట్ల లాభం వస్తోందని, ఈ మేరకు దశాబ్దాలుగా దోపిడీకి పాల్పడ్డారని ఆయన గణాంకాలతోసహా వివరించారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమ – అమూల్ ప్రాజెక్ట్ అనే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ ప్రైవేటు డెయిరీలు లీటరుకు రూ.35 చొప్పున లాభం ఆర్జిస్తున్నాయని చెప్పారు. ఆ ప్రకారం రోజుకు 10 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్న హెరిటేజ్ ఏడాదికి రూ.1,277.5 కోట్లు చొప్పున ఎన్నో ఏళ్లుగా ఆర్జిస్తోందని వివరించారు. రాష్ట్రంలో రోజుకు 412 లక్షల లీటర్ల పాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అందులో ప్రైవేటు డెయిరీలు 69 లక్షల లీటర్లే సేకరిస్తున్నాయని, 123 లక్షల లీటర్లు గృహ వినియోగం అవుతున్నాయని, మరో 220 లక్షల లీటర్ల పాలు అసంఘటిత రంగంలోకి వెళ్లిపోతున్నాయని వివరించారు. పాడి రైతులను దోచుకున్న చంద్రబాబు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో పాడి పశువుల కొనుగోలుకు బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు కచ్చితంగా హెరిటేజ్ డెయిరీకే పాలను సరఫరా చేయాలని షరతు విధించడం చంద్రబాబు దుర్మార్గానికి నిదర్శనమని చెప్పారు. ఇవన్నీ బయటపడతాయనే చంద్రబాబు శాసనసభలో లేకుండా వెళ్లిపోయారని చెప్పారు. సంగం డెయిరీ అక్రమాలపై విచారణ జరిపించాలి గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య మాట్లాడుతూ సంగం డెయిరీలో అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. సంగం డెయిరీ ఆస్తులను కొల్లగొట్టడానికి టీడీపీ నేతలు కుట్రపన్నారని ఆరోపించారు. -
బాబేమో పొర్లిపొర్లి ఏడుస్తున్నాడు..!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'ప్రపంచంలోనే అతిపెద్ద పాల సొసైటీ అమూల్‌ను వైఎస్ జగన్ గారు రాష్ట్రానికి ఆహ్వానిస్తే బాబుకి నిద్ర పట్టడం లేదు. విష ప్రచారాలు మొదలు పెట్టించాడు. హెరిటేజ్ కోసం విజయా డెయిరీని ఖతం చేశాడు. సేకరణ ధర పెరుగుతుందని పాడి రైతులు మురిసిపోతుంటే తనేమో పొర్లిపొర్లి ఏడుస్తున్నాడు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (ఆ లాజిక్‌ను చంద్రబాబు ఎప్పుడో గాలికొదిలారు!) మరో ట్వీట్లో.. 'భారీ ప్రాజెక్టులన్నీ చాలా ఏళ్ల తర్వాత నిండు కుండల్లా జలశోభను సంతరించుకున్నాయి. శ్రీశైలం, సోమశిల క్రెస్టు గేట్లు ఇంకా తెరుచుకునే ఉండగా, కండలేరు పూర్తి కెపాసిటీకి దగ్గరవుతోంది. మీడియం ఇరిగేషన్ డ్యాంలన్నీ వరద నీటితో కళకళలాడుతున్నాయి. మరో రెండేళ్ల పాటు నీటికి ఢోకా లేదు' అని పేర్కొన్నారు. (48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి రూ.5 వేలు) -
డెయిరీలను ముంచింది చంద్రబాబే
హెరిటేజ్ డెయిరీని లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వ డెయిరీలను మూతదిశగా నడిపించిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. పరిగి మండలం ఊటుకూరులో ఆరేళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం డెయిరీని శుక్రవారం ఆయన పునఃప్రారంభించారు. సాక్షి, అనంతపురం(పరిగి) : తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చుకునేందుకు ప్రభుత్వ డెయిరీలను నిర్వీర్యం చేసిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. పరిగి మండలం ఊటుకూరులో ఆరేళ్ల కిందట మూతపడిన ప్రభుత్వ పాల డెయిరీని మంత్రి శుక్రవారం పునఃప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. జాబు కావాలంటే బాబు రావాలన్న నినాదంతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు తన కుమారుడికి మాత్రమే జాబు కల్పించి యువతను నిలువునా మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రైవేటు డెయిరీలను ప్రోత్సహించి ప్రభుత్వ డెయిరీలను నష్టాల్లోకి నెట్టేశారని, దీనంతటికీ చంద్రబాబే కారణమని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టి, ప్రజలకు అవినీతిరహిత పాలన అందించడానికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టారన్నారు. పారదర్శక పాలనే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. గ్రామ వలంటీర్ల నియామకంతో ప్రతి ఇంటికీ రాజకీయాలకు, పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించనున్నట్లు తెలిపారు. త్వరలోనే రైతులు, ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయని మంత్రి పేర్కొన్నారు. మడకశిర బ్రాంచి కెనాల్ నుంచి ప్రధాన చెరువులను నింపుతామన్నారు. పరిగి చెరువులకు నడింపల్లి వద్ద నుంచే కాలువ ద్వారా నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 వేలు ఆర్థిక సాయంతో ఊరట ఆటో డ్రైవర్లకు, రజకులకు, నాయీబ్రాహ్మణులకు, టైలర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించే పథకానికి ఇటీవలే నోటిపికేషన్ విడుదలైందని, అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సౌజన్యలక్ష్మీ, ఎంపీడీఓ సుహాసినమ్మ, ఏపీ పాల డెయిరీ జిల్లా డీడీ శ్రీనివాసులు, మేనేజర్ బాలరాజు, పశుసంవర్థక శాఖ ఏడీ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ పా‘పాలు’
జిల్లాలోని పాడి రైతుల కష్టాన్ని ప్రైవేటు డెయిరీలు నిలువునా దోపిడీ చేస్తున్నాయి.పాలకు గిట్టుబాటు ధర కల్పించకుండా మొండి చేయి చూపుతున్నాయి.దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి చితికి పోతోంది. వెన్నశాతం పేరుతో తక్కువ ధర నిర్ణయిస్తూ మితిమీరిన పాలదోపిడీకి పాల్పడుతున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ కూడా ఈ దోపిడీలో భాగస్వామ్యం కలిగి ఉందని పాడిరైతులు ధ్వజమెత్తుతున్నారు. సాక్షి, కడప : జిల్లాలోని రైతాంగం అధిక శాతం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తోంది. దాదాపు 1.50 లక్షల మంది పంటల సాగుతో పాటు పాడి పశువుల పోషణతో జీవనం సాగిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో పంటలు పండకపోయినా పాడి పరిశ్రమతోనే బతుకు నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆవులు 1,38,132, బర్రెలు 4,57,504 ఉన్నాయి. ఇందులో పాలిచ్చే ఆవులు 46,485, పాలిచ్చే బర్రెలు 1,50,658 ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 2,25, 900 లీటర్ల నుంచి 2,32,625 లీటర్ల వరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 90,832 లీటర్ల నుంచి 1,05,658 లీటర్ల పాలను రైతులు గ్రామాల్లోని, పట్టణాల్లోని వినియోగదారులకు విక్రయిస్తుండగా మిగతావి ప్రైవేటు డెయిరీలకు పోస్తున్నారు. పాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో పశువుల కాపాడుకుంటూ.. కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలలో అత్యధికంగా ప్రైవేటు డెయిరీలకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా పాడి రైతులను నిలువునా దోచుకుంటూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నాయి. నిలువు దోపిడీ... పాడి రైతుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రైవేటు డెయిరీల మోసాలకు పాల్పడుతూ వస్తున్నాయి. గిట్టుబాటు ధర కల్పించడంలో చేస్తున్న జిమ్మిక్కులతో పాడి రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. లీటరు పాలకు సాలీడ్ నాన్ ఫ్యాట్ (ఎస్ఎన్ఎఫ్), ఫ్యాట్ల ఆధారంగా పాలకు ధర నిర్ణయించడం, అందులోనూ ట్యాక్స్‌ల పేరుతో మరికొంత కోత విధిస్తున్నాయి. సాధారణంగా పాలను కొలత పాత్రలో పోసి ల్యాక్టో మీటరు (ఎల్ఆర్) ఆధారంగా ఎస్ఎన్ఎఫ్ 8.5 శాతం, ఫ్యాట్ 4.5 మేరకు రీడింగ్ వస్తే లీటరుకు రూ.35 నుంచి 40లు నిర్ణయించాల్సి ఉంది. కానీ రూ.25 నుంచి 30 మాత్రమే ఇస్తున్నారు. ఈ విధంగా తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేసేందుకు రోజుకో ప్రైవేటు డెయిరీ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 10 ప్రైవేటు డెయిరీలు పాల సేకరణను చేస్తున్నాయి.ఇవి రోజుకు 1,35,856 లీటర్ల నుంచి 1,42,716 లీటర్ల పాలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. చంద్రబాబు స్వలాభం కోసం విజయా డెయిరీ నిర్వీర్యం...: జిల్లాలో తలమానికంగా నిలిచిన విజయా డెయిరీని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వలాభం కోసం నిర్వీర్యం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల కుటుంబాల రైతులు విజయా డెయిరీకి నిత్యం పాలుపోసి జీవనం సాగిస్తున్నారు. 1999 , 2014లో తన సొంత హెరిటేజ్ డెయిరీ అభివృద్ధి కోసం విజయా డెయిరీని నిలువునా ముంచారు. జిల్లాలోని పాడి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసి తన హెరిటేజ్ డెయిరీకి పాలను మళ్లించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనా కాలంలో పాడి రైతుల కష్టాలు వర్ణనాతీతం. బాబుగారి హెరిటేజ్ సంస్థ లీటరు పాలను ఎన్నికల ముందు వరకు రూ.52లతో ప్యాకెట్‌ను విక్రయించారు. ఎన్నికలు ముగియగానే దాన్ని కాస్తా రూ.54 చేశారు. ప్రస్తుతం లీటరు పాల ప్యాకెట్ ధర రూ.58 చేశారు. మిగతా డెయిరీలు కాసింత తక్కువగా అంటే లీటరు రూ.54–56 ధరతో విక్రయిస్తున్నాయి. ఇది దోపిడీ కాదా అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రైతుల వద్ద మాత్రం లీటరుకు రూ.30 నుంచి 35లకు కొనుగోలు చేసి లాభంతో అవే పాలను ప్యాకెట్లు చేసి విక్రయిస్తారా? అని ధ్వజమెత్తుతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో పాడి రైతు తేజోమయం... 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు డాక్టర్ రాజశేఖరరెడ్డి పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పశుక్రాంతి పథకాన్ని తీసుకొచ్చి పేద రైతులకు అందించి వారి కుటుంబాల్లో సంతోషం నింపారు. 2006లో డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో పాలశీతలీకరణ (బీఎంసీయూ) కేంద్రాలను ఏర్పాటు చేయించారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సబ్సిడీపై దాణా, గడ్డి విత్తనాలు, పోషకాల మందులు ఇచ్చేవారు. ప్రతి నెలా పశువైద్య శిబిరాలు నిర్వహించి పాడి పశువులు ఆరోగ్యంగా ఉండేలా చేశారు. మొత్తం 1.20 లక్షల లీటర్లు విజయా డెయిరీ వారు పాలసేకరణ చేసేవారు. పాడి రైతులకు ఎంతో ఊరట లభించేది. పోషణ భారంగా మారింది.. ప్రైవేట్ డెయిరీలు పాలదోపిడీతో పాడి పశువుల పోషణ భారంగా మారింది. విధలేనిపరిస్థితిలో ఆ డెయిరీలకు పాలను పోస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతులకు భరోసా ఇస్తున్నట్లు ప్రకటించడంతో మళ్లీ ప్రాణం లేచివచ్చినట్లే. ప్రైవేటు డెయిరీలను కట్టడి చేస్తూ ప్రభుత్వ ఆధీనంలోని విజయా డెయిరీ పాలను సేకరించేలా చూడాలి. – కె.చిన్నమ్మ, పాడిరైతు, ఎస్ సోమవరం, సంబేపల్లె మండలం. -
హెరిటేజ్ పాలవ్యాన్‌లో నగదు పట్టివేత
-
హెరిటేజ్ పాలవ్యాన్‌లో నగదు పట్టివేత
సాక్షి, అమరావతి: పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇందుకోసం భారీగా డబ్బు పంచడంతో పాటు, మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లకు డబ్బు, మద్యం చేర్చేందుకు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అక్రమ చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బు తరలిస్తున్నట్టు ఎవరికి అనుమానం రాకూడదనీ కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థ పాల వ్యాన్లను వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నేతలకు చెందిన నగదు, మద్యాన్ని ఎనిక్నల అధికారులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా మాకవరపాలెంలో హెరిటేజ్ పాల వ్యాన్‌లో తరలిస్తున్న 3.95లక్షల రూపాయల నగదును పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. విశాఖలో డబ్బులు పంచేందుకు టీడీపీ నేతలు ఈ డబ్బును తరలిస్తున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో ఎన్నికల తనిఖీల్లో భాగంగా టీడీపీ నాయకుల నుంచి 59,300 రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 35 కవర్లలో వెయ్యి రూపాయల చొప్పున ప్యాక్ చేసి ఉండటంతో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తంతోపాటు, మారుతి బ్రీజా కారును స్వాధీనం చేసుకున్న అధికారులు.. టీడీపీకి చెందిన దాసరి అప్పన్న , మట్టా సత్యనారాయణలను అదుపులోకి తీసుకున్నారు. దాసరి అప్పన్న డీసీసీబీ డైరక్టర్‌గా,ముదునూర్ సొసైటీ ప్రెసిడెంట్‌గా పనిచేస్తుండగా.. మట్టా సత్యనారాయణ పెంటపాడు బీసీ సెల్ అధ్యక్షునిగా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలు చేయడం కోసమే ఈ నగదును తరలిస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం వెంకటాపురం వద్ద పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. మండల టీడీపీ నాయకుడికి చెందిన వాటర్ ట్యాంకర్ ద్వారా తరలిస్తున్న వెయ్యి మద్యం సీసాలను స్వాధీనం చేసకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, టీడీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి రూప కోసం హైదరాబాద్ నుంచి డబ్బు తరలిస్తున్న జయభేరి ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
పాడి రైతు నష్టాల‘పాలు’
సాక్షి, దర్శి (ప్రకాశం): ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ లాభాల కోసం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసి ప్రకాశం జిల్లా పాడి రైతులను నష్టాల్లో ముంచింది. పాడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో హెరిటేజ్ డెయిరీలో 10 శాతం వెన్న ఉన్న పాల ధర రూ.54 ఉండగా ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసి నెల రోజుల్లో మూడు విడతలుగా రూ.3.50 ధరను తగ్గించారు. ఆ ఒక్క డెయిరీ మాత్రమే ధర తగ్గించడంతో ఇతర డెయిరీలకు పాలు పోసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో మిగతా డెయిరీలపై సామ, దాన, భేద, దండోపాయాలతో వారి చేత కూడా రేట్లు తగ్గించేలా అధికారాన్ని అడ్డంపెట్టి చంద్రబాబు అనుకున్నది సాధించారు. కరువుతో ఇబ్బందులు పడుతూ పాల ధరలు పెరుగుతాయన్న ఆశతో ఎదురు చూస్తున్న పాడి రైతులకు ఇది గట్టి ఎదురు దెబ్బగా మారింది. జిల్లాలో సుమారు 90 డెయిరీలు ఉండగా ఆ డెయిరీలకు గ్రామాల నుంచి పాలుపోసే కేంద్రాలు 4500ల వరకు ఉన్నాయి. జిల్లాలో ప్రతి రోజు సుమారు 6 లక్షల లీటర్ల పాలు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. పథకం ప్రకారం ప్రభుత్వ డెయిరీ నిర్వీర్యం హెరిటేజ్ లాభం కోసం ఇక్కడ ప్రభుత్వ డెయిరీని నష్టాల బాట పట్టించారు. ప్రభుత్వ డెయిరీ సుమారు రూ.80 కోట్లు అప్పుల్లో ఉండగా...పాడి రైతులకు మరో రూ.35 కోట్లు బకాయిలు ఉన్న సమయంలో డెయిరీని మూసివేశారు. దీంతో పాడి రైతులు, ఉద్యోగులకు నెలల తరబడి రావాల్సిన బకాయిలు, జీతాలు నిలిచిపోయాయి. బకాయిలు, జీతాలు చెల్లించాలని కోరుతూ రైతులు, ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు, నిరాహార దీక్షలు చేశారు. ఆ సమయంలో శిద్దా వెంకటేశ్వరరావు చైర్మన్‌గా నియమితులై పాడి రైతుల బకాయిలకు, ఉద్యోగుల జీతాలకు తాను కోట్లాది రూపాయలు చెల్లించి డెయిరీని మళ్లీ లాభాల బాటలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. మళ్లీ డెయిరీ ప్రారంభమైతే హెరిటేజ్, ఇతర ప్రైవేటు డెయిరీలకు ముప్పు కలుగుతుందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. కొన్ని నెలలు గడిచిన తరువాత గ్రామాల్లో పాడి రైతులు తమ బకాయిలు ప్రభుత్వం ఎగ్గొడితే సహించేది లేదని గ్రామాల్లో కూడా తిరగనివ్వమని టీడీపీ నేతలను నిలదీయడం మొదలు పెట్టారు. దీనికి తోడు ఎన్నికలు కూడా సమీపించడంలో పాడి రైతులు తమకు ఓట్లేయరన్న ఆలోచనలో టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. పాడి రైతులకైనా డబ్బు ఇస్తేనే గ్రామాల్లోకి వెళ్ల గలుగుతామని చెప్పడంతో సుమారు రూ.35 కోట్లు పాడి రైతులకు చెల్లించింది. ఈ లోపు ప్రభుత్వ డెయిరీకి సంబంధించిన ఖాతాలన్నీ హెరిటేజ్, ఇతర డెయిరీలు కైవసం చేసుకున్నాయి. ఆ తరువాత మళ్లీ డెయిరీని ప్రారంభించి పాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పాడి రైతులు మాత్రం ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తే డబ్బులు వస్తాయో లేదోనని ఆ డెయిరీకి పాలు పోసేందుకు మొగ్గు చూపలేదు. దీంతో తాము ఆడిందే ఆట పాడిందే పాటగా హెరిటేజ్, ఇతర ప్రైవేటు డెయిరీల వంతైంది. ప్రకాశం పాడి రైతులకు తీరని అన్యాయం దీన్ని సాకుగా పెట్టుకుని పక్కన ఉన్న గుంటూరు జిల్లాలో లీటరు పాలకు రూ.57 చెల్లిస్తుంటే ప్రకాశం జిల్లాలో మాత్రం రూ.52 మాత్రమే చెల్లిస్తున్నారు. ఒక లీటరుకు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రూ.5లు తేడా ఉండగా గుంటూరు జిల్లాలో ఈ ధరకు గతంలో మరో రూ.4 బోనస్ కూడా ఇచ్చారు. ఆ బోనస్‌ను ప్రస్తుతం రూ.6.50 పెంచారు. అంటే ఈ లెక్క ప్రకారం ఒక పాడి రైతుకు గుంటూరు జిల్లాకు ప్రకాశం జిల్లాకు ఒక లీటరు పాలకు రూ.11.50 తేడా ఉంది. ఈ లెక్కన రోజూ జిల్లాలో 6 లక్షల లీటర్ల పాలకు రూ.69 లక్షలు, నెలకు రూ.20.70 కోట్లు ప్రకాశం జిల్లా పాడి రైతులను ప్రభుత్వం నష్టాల పాలు చేసింది. ప్రకాశం పాడి రైతులపైనే హెరిటేజ్ వివక్ష అయితే గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా శివారు ప్రాంతాల్లో రైతులు ప్రకాశం జిల్లాల్లో ఉన్న డెయిరీలకు పాలు సరఫరా చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు సరఫరా చేసే పాలకు మాత్రం గుంటూరు జిల్లాలో ఇచ్చే ఎక్కువ ధరలనే ఇక్కడ డెయిరీలు ఇవ్వడం గమనార్హం. దీంతో హెరిటేజ్ ఎక్కువ ధర చెల్లించడంతో ఇతర డెయిరీలు గుంటూరు జిల్లా వారికి ఆ ధరలు చెల్లించలేక అక్కడ ఖాతాలను వదిలేసుకుంటున్నారు. అటువంటి ఖాతాలను హెరిటేజ్ చేజిక్కించుకుని వారికి మాత్రం అధిక ధరలను ఇవ్వడమే కాక ఇక్కడ డెయిరీలను కూడా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నష్టాల బాటలో పాడి రైతు ఈ పాటికే పాడి రైతులు నష్టాల బాట పట్టారు. పాలు ధరలు గిట్టుబాటు కాక గేదెలను మండీకి తరలిస్తారు. ఇక్కడ వరిగడ్డి దొరక్క తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ప్రకాశం జిల్లాకు వరిగడ్డి లారీల ద్వారా కొనుగోలు చేసి తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. లారీ ఎండు గడ్డి కొనాలంటే రూ.25 వేల వరకు ధర పలుకుతోంది. వర్షాలు లేక, బోర్లు అడుగంటి గ్రామాల్లో పచ్చిగడ్డి మొత్తం ఎండిపోయింది. అసలే నష్టాల్లో ఉన్న పాడి రైతుకు ధర తగ్గించడం మూలిగే నక్కపై తాటికాయ పడిన సామెతగా తయారైందని పాడి రైతులు వాపోతున్నారు. ఎన్నికలు ముగిస్తే డెయిరీ మూసేందుకు సిద్ధం ఎన్నికలు ఉన్నాయన్న నెపంతోనే కేవలం ప్రభుత్వ డెయిరీని కొనసాగిస్తున్నారు. ఎన్నికలు పూర్తయితే డెయిరీని మూసివేసి మళ్లీ పాడి రైతులకు ధరలు తగ్గించి హెరిటేజ్ లాభాలు పొందేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డెయిరీ తెరిచిన తరువాత కూడా మూడు నెలల జీతాలు చెల్లించనట్లు సమాచారం. ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే పాడి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి రైతులకు అండగా జగన్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే జిల్లా డెయిరీ అభివృద్ధి చెందుతుందని పాడి రైతులు అభిప్రాయపడుతున్నారు. పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో 2017 డిసెంబర్ 30న లీటరు పాలకు రూ.4 రాయితీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో జిల్లాలోని పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరువు కోరల్లో చిక్కిన ప్రకాశం జిల్లా పాడి రైతులకు వైఎస్సార్ రైతు బరోసా ఆసరాగా నిలుస్తోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
హెరిటేజ్ ఎఫెక్ట్ రైతుల భూములకు ఎసరు
-
‘హెరిటేజ్’ కోసమే బైపాస్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో నేషనల్ హైవే అథారిటీ(ఎన్హెచ్ఏఐ) చేపట్టిన తిరుపతి–చిత్తూరు రహదారి విస్తరణ పనులు వివాదాస్పదంగా మారాయి. ఈ మార్గంలో ఉన్న హెరిటేజ్ డెయిరీ భూములను భూసేకరణ నుంచి తప్పించేందుకు తమ భూములకు ఎసరు పెడుతున్నారని రైతులు మండి పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసం తమను బలి చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు భూములు కోల్పోతే ఇక ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. హెరిటేజ్‌కు మేలు చేసేందుకు రోడ్డు అలైన్మెంట్ మార్చేశారని, ఆ సంస్థ భూములను కాపాడడంతో పాటు వాటి విలువను భారీగా పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారని విమర్శిస్తున్నారు. అసలేం జరిగింది? నాయుడుపేట నుంచి చిత్తూరు వరకూ ఉన్న రెండు వరుసల రహదారిని(ఎన్‌హెచ్–140) ఆరు లేన్ల రోడ్డుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి ప్యాకేజీలో చిత్తూరు–తిరుపతి మధ్యనున్న 61 కిలోమీటర్లు, రెండో ప్యాకేజీలో తిరుపతి–నాయుడుపేట మధ్యనున్న 55 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చింది. ఒక్కో ప్యాకేజీకి రూ.1,200 కోట్లు కేటాయించింది. భూసేకరణ, పరిహారం చెల్లింపుల కోసం మరో రూ.300 కోట్లు కేటాయించింది. మొదటి ప్యాకేజీలో రెండు చోట్ల బైపాస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. ముంగిలిపట్టు నుంచి పనబాకం వరకూ (7.5 కిలోమీటర్లు) ప్రతిపాదించిన బైపాస్ రోడ్డు విషయంలో అధికారులు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ భూములకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పడ్డారు. డెయిరీ ఆ భూముల విలువ రెట్టింపయ్యేలా అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. హెరిటేజ్‌కు రెండు వైపులా రోడ్లే ప్రస్తుతం హెరిటేజ్ డెయిరీ ప్రధాన గేటుకు ముందుగా తిరుపతి–చిత్తూరు రెండు వరుసల రహదారి వెళ్తోంది. ఈ ప్రాంతంలో (కాశిపెంట్ల) రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించాలంటే కుడి వైపున రైల్వే లైన్, ఎడమ వైపున హెరిటేజ్ డెయిరీ సరిహద్దులు ఉన్నాయి. రైల్వే లైన్ వైపు విస్తరణకు అవకాశం లేదు కాబట్టి ఎడమ వైపునే ఎక్కువ భూమిని సేకరించాలి. అదే జరిగితే హెరిటేజ్ స్థలం చాలావరకు భూసేకరణ కింద పోవడం ఖాయం. దీంతో అధికారులు ఇక్కడ బైపాస్ అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం ఏడున్నర కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో బైపాస్ రోడ్డు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఉన్న తిరుపతి–చిత్తూరు రెండు వరుసల రహదారి నుంచి ముంగిలిపట్టు దగ్గర చీలే బైపాస్ రోడ్డు హెరిటేజ్ డెయిరీ వెనుకగా వెళ్లి పనబాకం రైల్వేస్టేషన్‌కు ముందు మళ్లీ పాత రోడ్డులో కలుస్తుంది. ఈ బైపాస్ నిర్మాణం పూర్తయితే హెరిటేజ్ డెయిరీకి ముందు రెండు వరసలు, వెనుక ఆరు వరసల రహదార్లు ఉంటాయి. 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హెరిటేజ్ భూముల ధర భారీగా పెరుగుతుంది. ముఖ్యమంత్రి మెప్పు పొందడానికే అధికారులు బైపాస్‌ను తెరపైకి తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ బైపాస్ నిర్మాణానికి 300 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. దీనివల్ల 60 మందికి పైగా రైతులు తమ సాగు భూములను కోల్పోనున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను పోగొట్టుకుని ఎలా బతకాలని బాధిత రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బైపాస్ నిర్మాణానికి భూములిచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న రైతులు న్యాయం కోసం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు యథాతథ స్థితి(స్టేటస్ కో) ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కొన్నాళ్లపాటు భూముల సర్వే నిలచిపోయింది. అయితే, వారం రోజులుగా చంద్రగిరి, పాకాల మండలాల రెవెన్యూ అధికారులు బైపాస్ రోడ్డు పనుల కోసం రైతుల భూములను సర్వే చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సర్వే చేయడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రత్యామ్నాయం ‘బోనిత్తుల రోడ్డే.. బైపాస్ నిర్మాణం అనివార్యమని అధికారులు చెబుతుండగా, ఎప్పటి నుంచో వాడకలో ఉన్న బోనిత్తుల రోడ్డు ఇందుకు ఉపయోగించుకోవచ్చని రైతులు అంటున్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూములే ఉన్నాయని, దీన్ని ఆరు లేన్లుగా విస్తరిస్తే ఎవరికీ నష్టం వాటిల్లదని పేర్కొంటున్నారు. పొలం, ఇల్లు పోతున్నాయి ‘‘నేను రిటైర్డ్ ఉద్యోగిని. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ సొంతింట్లో ఉంటున్నా. బైపాస్ కోసం భూసేకరణలో నా పొలం, ఇల్లు పోతున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. పనబాకంలో 30కి పైగా ఇళ్లు పోయే ప్రమాదం ఉంది’’ – డాక్టర్ జె.బాపూజీ, పనబాకం గ్రామం పొలమంతా పోతుంది ‘‘బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ జరిపితే నాకున్న 2.50 ఎకరాల వ్యవసాయ భూమి మొత్తం పోతుంది. ఆ భూమే నాకు జీవనాధారం. అది లేకుండా పోతే ఎలా బతకాలో తెలియడం లేదు. పెద్దలు భూములను కాపాడడానికి మాలాంటి పేదల భూములు లాక్కోవడం అన్యాయం’’ – ఎస్.జనార్దన్, రైతు, కొత్తిఇండ్లు గ్రామం -
‘చంద్రన్న మజ్జిగ’పై కదిలిన అధికారులు
♦ హడావుడిగా సవరణ ఉత్తర్వులు ♦ హెరిటేజ్‌తోపాటు మరికొన్ని సంస్థలకు అవకాశం సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో హెరిటేజ్ డెయిరీతోపాటు విశాఖ డెయిరీ పెరుగును కూడా చలివేంద్రాల్లో పంపిణీ చేశామని కలెక్టర్ ఎంఎం నాయక్ పేర్కొన్నారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘హెరిటేజ్ లాభం కోసం చంద్రన్న మజ్జిగ’ అనే కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. విశాఖ డెయిరీ వారు విజయనగరం పట్టణంలో మాత్రమే పెరుగు సరఫరా చేయగలమని చెప్పడంతో మిగిలిన ప్రాంతాల్లో హెరిటేజ్ పెరుగు తీసుకుని మజ్జిగ చేసి అందించే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. హెరిటేజ్ పెరుగును మాత్రమే అందించాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి మౌఖికంగా తమకు రాలేదని వెల్లడించారు. చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీపై విజయనగరం జిల్లా అధికారులు హడావుడిగా సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. చలివేంద్రాలకు పెరుగు సరఫరా చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి సొంత కంపెనీ హెరిటేజ్‌తోపాటు మరికొన్ని సంస్థలకు కల్పిస్తూ ఉత్తర్వులను మార్చారు. జిల్లాలోని 9 మండలాల్లో మజ్జిగ సరఫరా చేసేందుకు హెరిటేజ్ సంస్థ నుంచి పెరుగు కొనుగోలు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ పేరిట డీఆర్వో మారిశెట్టి జితేంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో తిరుమల, జెర్సీ, విశాఖ, హెరిటేజ్ సంస్థలతోపాటు రిజిస్టర్ అయిన కో-ఆపరేటివ్ సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి గతంలో ప్రకటించిన ధరకే పెరుగు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. -
హెరిటేజ్ డైరీలో వాచ్మెన్ మృతి
కొండాపురం (నెల్లూరు జిల్లా) : హెరిటేజ్ డైరీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలోని హెరిటేజ్ డైరీలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన నర్సింహా(56) హెరిటేజ్ డైరీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కాగా గురువారం మోటర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ సంస్థలపై ఉక్కుపాదం
హెరిటేజ్ డెయిరీ దెబ్బకు విజయాడెయిరీ మూత గల్లా ఫుడ్స్ దెబ్బకు ఏపీ ఫుడ్ {పాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్ మూత పాడి రైతులు చంద్రబాబు డెయిరీకి పాలమ్ముతున్న వైనం పండ్ల తోటల రైతులు గల్లా ఫుడ్స్‌కు పండ్లమ్ముతున్న చిత్రం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఇరువురు నేతల స్వార్థానికి జిల్లాలో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయి. వేల మంది పాడి రైతులు, పండ్లతోటల రైతులకు ఆ ఇద్దరు నెలకొల్పిన సంస్థలకు పాలు, పండ్లు అమ్ముకునే విధంగా పథకం రూపొందించారు. చిత్తూరు జిల్లా పాడిపరిశ్రమకు పెట్టింది పేరు. దేశంలోనే అగ్రస్థానంలో పాలు ఉత్పత్తి చేస్తోంది. ప్రభుత్వం తరఫున విజయ డెయిరీ లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించేది. ఈ డెయిరీకి 23 సంవత్సరాల చరిత్ర ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఉన్న పాల ఉత్పత్తిని గమనించారు. పాల ఉత్పత్తులు తయారు చేయించడంతో పాటు పాలను కొనుగోలు చేస్తే మంచి లాభా లు చూడవచ్చునని భావించి హెరిటేజ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపించిన రెండు సంవత్సరాలకే విజయా డెయిరీ మూతపడింది. విజయాడెయిరీకి పాలు పోసే రైతులంతా హెరి టేజ్ డెయిరీకి పాలు పోయడం ప్రారంభించారు. ప్రభుత్వ సంస్థను నిర్వీర్యం చేసి సొంత సంస్థకు జిల్లాలో ఎదురులేకుండా తయారు చేసుకున్న ఘనత చంద్రబాబుకు దక్కిందని పలువురు విమర్శిస్తున్నారు. చిత్తూరు జిల్లా మామిడి ఉత్పత్తికి పేరుగాంచింది. అయితే మామిడి దిగుబడికి తగినం తగా ధరలు లేక రైతులు ఇబ్బందులు పడడంనాటి సీఎం ైవె ఎస్.రాజశేఖరరెడ్డి గుర్తించారు. వీరికోసం తిరుపతిలోని మార్కెట్ యార్డు వద్ద రూ.22.70 కోట్ల వ్యయంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్‌ని 2008లో ప్రారంభించారు. యూనిట్లో తమ ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు 570 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిని ఒక ఏడాది నడిపేందుకు ప్రభుత్వం నుంచి ముంబయిలోని జాక్షన్ కంపెనీవారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మొదటిసారిగా 2008 ఆగస్టు 8న ఏ వన్ గ్రేడ్ మామిడి పండ్లు దుబాయ్‌కి ఎగుమతి చేశారు. పండ్ల ఎగుమతులకు మంచి అవకాశం ఉందని అందరూ భావించారు. రైతులు కూడా ఎక్కువగా మామిడితోపాటు ఇతర పండ్ల తోటలు వేసేందుకు నిర్ణయించారు. ఉన్నట్లుండి కంపెనీ సక్రమంగా పనిచేయడం మానేసింది. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి చంద్రగిరికి సమీపంలోని కాశిపెంట్ల వద్ద 2009 నవంబరులో గల్లా ఫుడ్స్ ఏర్పాటు చేశారు. రైతులు పండించిన మామిడిని నేరుగా గల్లా ఫుడ్స్ కంపెనీ కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీంతో ప్రభుత్వ కంపెనీ మూతపడింది. కంపెనీలోని పరికరాలు పనికి రాకుండా తుప్పు పట్టాయి. ఈ కంపెనీని లీజుకు తీసుకోకుండా మంత్రి చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి.