ప్రభుత్వ సంస్థలపై ఉక్కుపాదం
- హెరిటేజ్ డెయిరీ దెబ్బకు విజయాడెయిరీ మూత
- గల్లా ఫుడ్స్ దెబ్బకు ఏపీ ఫుడ్ {పాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్ మూత
- పాడి రైతులు చంద్రబాబు డెయిరీకి పాలమ్ముతున్న వైనం
- పండ్ల తోటల రైతులు గల్లా ఫుడ్స్‌కు పండ్లమ్ముతున్న చిత్రం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఇరువురు నేతల స్వార్థానికి జిల్లాలో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయి. వేల మంది పాడి రైతులు, పండ్లతోటల రైతులకు ఆ ఇద్దరు నెలకొల్పిన సంస్థలకు పాలు, పండ్లు అమ్ముకునే విధంగా పథకం రూపొందించారు.
చిత్తూరు జిల్లా పాడిపరిశ్రమకు పెట్టింది పేరు. దేశంలోనే అగ్రస్థానంలో పాలు ఉత్పత్తి చేస్తోంది. ప్రభుత్వం తరఫున విజయ డెయిరీ లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించేది. ఈ డెయిరీకి 23 సంవత్సరాల చరిత్ర ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఉన్న పాల ఉత్పత్తిని గమనించారు. పాల ఉత్పత్తులు తయారు చేయించడంతో పాటు పాలను కొనుగోలు చేస్తే మంచి లాభా లు చూడవచ్చునని భావించి హెరిటేజ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపించిన రెండు సంవత్సరాలకే విజయా డెయిరీ మూతపడింది. విజయాడెయిరీకి పాలు పోసే రైతులంతా హెరి టేజ్ డెయిరీకి పాలు పోయడం ప్రారంభించారు. ప్రభుత్వ సంస్థను నిర్వీర్యం చేసి సొంత సంస్థకు జిల్లాలో ఎదురులేకుండా తయారు చేసుకున్న ఘనత చంద్రబాబుకు దక్కిందని పలువురు విమర్శిస్తున్నారు.
చిత్తూరు జిల్లా మామిడి ఉత్పత్తికి పేరుగాంచింది. అయితే మామిడి దిగుబడికి తగినం తగా ధరలు లేక రైతులు ఇబ్బందులు పడడంనాటి సీఎం ైవె ఎస్.రాజశేఖరరెడ్డి గుర్తించారు. వీరికోసం తిరుపతిలోని మార్కెట్ యార్డు వద్ద రూ.22.70 కోట్ల వ్యయంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్‌ని 2008లో ప్రారంభించారు. యూనిట్‌లో తమ ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు 570 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిని ఒక ఏడాది నడిపేందుకు ప్రభుత్వం నుంచి ముంబయిలోని జాక్షన్ కంపెనీవారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మొదటిసారిగా 2008 ఆగస్టు 8న ఏ వన్ గ్రేడ్ మామిడి పండ్లు దుబాయ్‌కి ఎగుమతి చేశారు. పండ్ల ఎగుమతులకు మంచి అవకాశం ఉందని అందరూ భావించారు.
రైతులు కూడా ఎక్కువగా మామిడితోపాటు ఇతర పండ్ల తోటలు వేసేందుకు నిర్ణయించారు. ఉన్నట్లుండి కంపెనీ సక్రమంగా పనిచేయడం మానేసింది. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి చంద్రగిరికి సమీపంలోని కాశిపెంట్ల వద్ద 2009 నవంబరులో గల్లా ఫుడ్స్ ఏర్పాటు చేశారు. రైతులు పండించిన మామిడిని నేరుగా గల్లా ఫుడ్స్ కంపెనీ కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీంతో ప్రభుత్వ కంపెనీ మూతపడింది. కంపెనీలోని పరికరాలు పనికి రాకుండా తుప్పు పట్టాయి. ఈ కంపెనీని లీజుకు తీసుకోకుండా మంత్రి చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి.