public sector organizations
-
అన్ని రంగాల్లో ప్రైవేటు సంస్థలకు ఎంట్రీ
న్యూఢిల్లీ: కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) గరిష్టంగా నాలుగింటికే పరిమితం చేయనుంది. మిగతావాటన్నింటినీ విలీనం చేయడమో లేదా విక్రయించడమో చేయనుంది. వ్యూహాత్మకయేతర రంగాల్లో పీఎస్‌యూలన్నింటినీ ప్రైవేటీకరించనుంది. ఈ మేరకు కొత్తగా పీఎస్‌యూ విధానాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు ఉద్దేశించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తుది విడత చర్యల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వెల్లడించారు. (జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి) ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పీఎస్‌యూలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరమున్న వ్యూహాత్మక రంగాల వివరాలను త్వరలో నోటిఫై చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ రంగాల్లోనూ ప్రైవేట్ సంస్థలను అనుమతించినప్పటికీ కనీసం ఒక్క పీఎస్‌యూనైనా కొనసాగిస్తారు. ఇక వ్యూహాత్మకయేతర రంగాల్లో పీఎస్‌యూలను సాధ్యాసాధ్యాలను బట్టి తగు సమయంలో ప్రైవేటీకరిస్తామని మంత్రి చెప్పారు. ‘స్వయం సమృద్ధిని సాధించే క్రమంలో దేశానికి సమగ్రమైన విధానం అవసరం. ఇది దృష్టిలో ఉంచుకునే కొత్త పీఎస్‌యూ విధానంలో అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పీఎస్‌యూలు అర్థవంతమైన పాత్ర పోషిస్తున్న వ్యూహాత్మక రంగాల్లో వాటిని కొనసాగిస్తూనే.. అనవసర నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే దిశగా సంఖ్యను మాత్రం కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా నాలుగింటికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా వాటన్నింటినీ హోల్డింగ్ కంపెనీల్లోకి చేర్చడం, విలీనం చేయడం లేదా ప్రైవేటీకరించడం జరుగుతుంది’ అని ఆమె వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా 2020–21లో రూ. 2.10 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యాన్ని సాధించేందుకూ ఇది తోడ్పడనుంది. చిన్న సంస్థలకు ఊరట.. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో వ్యాపారాలు దెబ్బతిని, రుణాలు కట్టలేకపోయిన చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊరట దక్కనుంది. దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి సంబంధించి కనీస బాకీల పరిమాణాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 1 కోటికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే, ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రత్యేకంగా దివాలా పరిష్కార మార్గదర్శకాలను కూడా దివాలా కోడ్‌లోని (ఐబీసీ) సెక్షన్ 240ఎ కింద త్వరలో నోటిఫై చేయనున్నట్లు వివరించారు. ఇక, మహమ్మారి వ్యాప్తి పరిస్థితులను బట్టి కొత్త దివాలా పిటిషన్ల దాఖలును ఏడాది పాటు నిలిపివేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనాపరమైన రుణాల ఎగవేతలను దివాలా కోడ్‌లో (ఐబీసీ) డిఫాల్ట్ పరిధి నుంచి తప్పిస్తూ తగు సవరణలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు, కంపెనీల చట్టం ప్రకారం సాంకేతికంగాను, ప్రక్రియపరంగాను తప్పనిసరైన నిబంధనల పాటింపు విషయంలో స్వల్ప ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల పరిధి నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసు కుంది. కార్పొరేట్ సామాజిక కార్యకలాపాల (సీఎస్ఆర్) వివరాల వెల్లడి లోపాలు, బోర్డు నివేదికల్లో లోటుపాట్లు, ఏజీఎంల నిర్వహణలో జాప్యం వంటి స్వల్ప ఉల్లంఘనలను డిక్రిమినలైజ్ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. విదేశాల్లో నేరుగా లిస్టింగ్.. లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు తమ షేర్లను నేరుగా నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్ చేసుకునేందుకు అనుమతించనున్నట్లు చెప్పారు. దేశీ కంపెనీలకు ఇది భారీ ముందడుగని ఆర్థిక మంత్రి అన్నారు. -
ఏఏఐలో కేంద్రానికి షేర్లు
న్యూఢిల్లీ: కేంద్రం నుంచి లభించిన రూ.656 కోట్ల మూలధనానికి సరిపడా షేర్లు జారీ చేయాలంటూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. గడిచిన కొన్నేళ్లుగా ఈక్విటీకి ప్రతిగా కేంద్రం ఈ నిధులు అందిస్తూ వచ్చింది. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు షేర్లను బైబ్యాక్ చేసే అంశంపై చర్చల సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఏఏఐ కార్పొరేటీకరణపై కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన శాఖ అధికారులు సమావేశమయ్యారు. పెట్టుబడికి ప్రతిగా ఏఏఐ షేర్లు జారీ చేసే అంశంపై కేంద్రం న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. షేర్ల జారీ పూర్తయితే ఏఏఐని కంపెనీల చట్టం కింద ప్రత్యేక సంస్థగా మార్చేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని వివరించాయి. ప్రస్తుతం 100 శాతం ప్రభుత్వ అధీనంలోని చట్టబద్ధ సంస్థగా ఏఏఐ ఉంది. తాజాగా, ప్రత్యేక కంపెనీగా మార్చిన తర్వాత ఏఏఐలో వాటాల విక్రయం, షేర్ల బైబ్యాక్ లేదా స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టింగ్ చేసే అంశాలను ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు.. నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాల విలీనం ద్వారా 1995 ఏప్రిల్ 1న పార్లమెంటు చట్టం ద్వారా ఏఏఐ ఏర్పాటు అయ్యింది. ప్రస్తుతం ఇది 100 శాతం ప్రభుత్వ అదీనంలోని చట్టబద్ధ కార్పొరేషన్‌గా ఉంది. 2017–17లో వచ్చిన రూ. 2,800 కోట్ల లాభాలు మొత్తం కేంద్రానికి డివిడెండ్‌గా బదలాయించింది. ఏఏఐ దేశీయం గా పౌర విమానయాన మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 125 విమానాశ్రయాలు ఏఏఐ నిర్వహణలో ఉన్నాయి. వీటిలో 18 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 7 కస్టమ్స్ ఎయిర్‌పోర్టులు, 78 దేశీ య విమానాశ్రయాలు మొదలైనవి ఉన్నాయి. -
దాతృత్వ సంస్థలు, ప్రభుత్వాలకూ గోల్డ్ డిపాజిట్ స్కీమ్
ముంబై: పసిడి డిపాజిట్ స్కీమ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక మార్పులు చేసింది. దీనిప్రకారం ఇకపై దాతృత్వం సంస్థలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోగలుగుతాయి. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ స్కీమ్ వ్యక్తులు, జాయింట్ డిపాజిట్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దేశంలో గృహాలు, సంస్థల వద్ద అవసరానికి మించి ఉన్న పసిడిని మార్కెట్లోకి తీసుకురావడం, పసిడి దిగుమతులను తగ్గించి దేశాన్ని కరెంట్ అకౌంట్ లోటు తీవ్రత నుంచి తప్పించడం ఉద్దేశ్యంగా 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్ధిష్ట కాలపరిమితుల్లో పసిడి డిపాజిట్ల ఆ మేరకు విలువపై 2.25 నుంచి 2.50 శాతం శ్రేణిలో వడ్డీ పొందే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ పథకం విజయం సాధించలేదని గణాంకాలు పేర్కొంటున్నాయి. -
ఐపీఓకు... ఆరు ప్రభుత్వ సంస్థలు
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానున్నాయి. ఈ ఆరు పీఎస్‌యూలు ఐపీఓకు రావడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపినట్లు న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. అంతే కాకుండా కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ (కేఐఓసీఎల్) ఫాలో ఆన్ ఆఫర్‌కు (ఎఫ్‌పీఓ) కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ఆరు పీఎస్‌యూలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం వల్ల వాటి విలువ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఐపీఓకు రానున్న ఆరు పీఎస్‌యూలు ఇవే... ►రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియా ►టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్(ఇండియా) (టీసీఐఎల్) ►నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్సీ) ►తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్,) ►వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) ►ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ అండ్ మినరల్స్ (ఇండియా)(ఎఫ్‌ఏజీఎమ్‌ఐఎల్) అయితే ఈ ఐపీఓ, ఎఫ్పీఓలు ఈ ఆర్థిక సంవత్సరంలోనా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనా అనే విషయాన్ని రవి శంకర్ ప్రసాద్ వెల్లడించలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల లిస్టింగ్ అర్హత నిబంధనలను కేంద్రం మరింతగా విస్తరించింది. వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం సాధించిన సీపీఎస్‌యూలు స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టింగ్‌కు అర్హత పొందుతాయని స్పష్టంచేసింది. -
క్రీమీలేయర్‌లోకి పీఎస్‌యూ ఉద్యోగాలు
ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీలు కూడా.. కేంద్ర కేబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ: ఓబీసీల్లో సంపన్న వర్గమైన ‘క్రీమీలేయర్’ పరిధిని కేంద్రం విస్తరించింది. ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు), ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో కొన్ని పోస్టులు దీని కిందికి వస్తాయని పేర్కొంది. దీంతో ఆయా స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, కుటుంబీకులు ఓబీసీ కోటాలో రిజర్వేషన్‌కు దూరమవుతారు. ఇందుకు సంబంధించి కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓబీసీల్లో సామాజికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులు, వర్గాలను కూడా రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించింది. తాజా నిర్ణయం ప్రకారం... పీఎస్‌యూల్లో అన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టుల(బోర్డు, మేనేజ్మెంట్ స్థాయి కలుపుకుని)ను గ్రూప్ ఏ పోస్టులతో సమానంగా క్రీమీలేయర్‌గా భావిస్తారు. ప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీల్లో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్–1 ఆపై స్థాయి ఉద్యోగులని గ్రూప్ ఏ ఉద్యోగులతో సమానంగా భావిస్తూ క్రీమీలేయర్ హోదా ఇస్తారు. ఇక క్లర్క్‌లు, ప్యూన్లకు సంబంధించి సమయానుగుణంగా వారి ఆదాయ వనరుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు‘క్రీమీలేయర్ పరిధి విస్తరణతో పీఎస్‌యూలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దిగువ స్థాయుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు... ప్రభుత్వ విభాగాల్లో దిగువ స్థాయుల్లో పనిచేస్తున్న వారి పిల్లలతో సమానంగా ఓబీసీ రిజర్వేషన్ల ఫలాలు పొందుతారు’ అని కేబినెట్ భేటీ అనంతరం ప్రకటనలో కేంద్రం పేర్కొంది. ♦ ఎన్నికల నిర్వహణలో ఆరు దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలన్న ఈసీ ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం. ఇందులో ఈక్వెడార్, ఆల్బేనియా, భూటాన్, అఫ్గానిస్తాన్, గినియా, మయన్మార్ దేశాలున్నాయి. ♦ పారిశ్రామిక అభివృద్ధి కోసం 40 మిలియన్ డాలర్లతో ఫండ్ ఏర్పా టుకు భారత్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందానికి ఆమోదం. -
ఇలా అయితే మేక్ ఇన్ ఇండియా అసాధ్యం
{పభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే అభివృద్ధిలో వెనుకబాటే తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం హెచ్‌సీఎల్ ఉద్యోగులకు సంఘీభావం కవాడిగూడ: ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ మరోవైపు కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అని పిలుపునివ్వడం ఎంతవరకు సబబని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడిన ప్రభుత్వ రంగసంస్థలను పటిష్టం చేస్తేనే ప్రభుత్వం ఆశించిన మేక్ ఇన్ ఇండియా సాధ్యమవుతుందని ఆయన అన్నారు. హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) కంపెనీని మూతవేయాలనే కుట్రలకు నిరసనగా హెచ్‌సీఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగళవారం మహాధర్నా జరిగింది. కార్యక్రమానికి కోదండరాం, ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్ (సీపీఐ), సున్నం రాజయ్య (సీపీఎం), బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, సీఐటీయూ నాయకులు సాయిబాబా, ఏఐటీయూసీ నాయకులు వీఎస్ బోస్‌లు హాజరై హెచ్‌సీఎల్ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. కోదండరాం మాట్లాడుతూ దేశంలో పెట్టుబడులు లేనప్పుడు ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే పారిశ్రామిక అభివృద్ధి జరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రాజకీయజోక్యం అధికమవడం వల్లే ఎక్కువ శాతం ప్రభుత్వ కంపెనీలు మూతపడ్డాయని వివరించారు. ప్రభుత్వ కంపెనీలు మూతపడిన కారణంగా కేవలం హైదరాబాద్ నగరంలోనే సుమారు 25 వేల మంది ఉద్యోగులను తొలగించారని తెలిపారు. హెచ్‌సీఎల్ కంపెనీని ఓఎఫ్‌బీ (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు) తీసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు తీసుకుంటున్న అడ్డుగోలు నిర్ణయాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు కనుమరుగువుతున్నాయని పేర్కొన్నారు. ప్రయివేటు కేబుల్ పరిశ్రమలకు అనుమతిచ్చి హెచ్సీఎల్ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా డిఫెన్స్ అసోసియేషన్ నాయకులు చంద్రయ్య, ఇసీఐఎల్, మిథానీ, బీఇఎల్, బీహెచ్ఇఎల్ తదితర కార్మిక సంఘాల నేతలతో పాటు హెచ్‌సీఎల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జె.సుబ్బారావు, ఉపాధ్యక్షులు శరత్‌బాబు, బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.దామోదరరెడ్డి, సహాయ కార్యదర్శులు పాపయ్య, లక్ష్మీనారాయణ, పద్మారావు, సాంబశివారెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. -
ప్రభుత్వరంగ సంస్థల బలోపేతానికి కృషి: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ పునర్ నిర్మాణంలో ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యక్రమానికి, ఎర్రగడ్డలోని విక్టరీ గార్డెన్స్‌లో జరిగిన ఎఫ్‌సీఐ శ్రామిక్ యూనియ న్ ఆవిర్భావ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన లో పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల పాత్ర కీలకమైందని అన్నారు. ఈ సంస్థలను పటిష్టం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే, పౌర సరఫరాల శాఖలో పనిచేసే హమాలీల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ పబ్లిక్‌సెక్టార్ భాగస్వామ్యంతో బంగారు తెలంగాణను నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ ,బి.నర్సింహారెడ్డి, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్, తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సి.విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు లభించని ‘మద్దతు’
- పంటలకు మద్దతు ధర కరువు ఆదుకోని ప్రభుత్వ రంగ సంస్థలు - దళారులను ఆశ్రయించి నష్టపోతున్న రైతులు ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కరువైంది. పంట దిగుబడులను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామనే హామీలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చేతి కొచ్చిన పంటలను మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో సాగు చేసిన శెనగ, వరి, మొక్కజొన్న, కందులు తదితర పం టలను మార్కెట్‌యార్డులకు తరలిస్తే ప్రభుత్వ మద్దతు ధర లభించక.. పెట్టుబడులు రాక నష్టాలు చవిచూస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు వివిధ గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్, పీఎస్‌యూ ద్వారా 155 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ మండలాల్లో అందుబాటులో లేక రైతులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు సీసీఐ, ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్, నాఫెడ్, డీసీఎంఎస్ మార్కెట్ అధికారుల ఒత్తిడి మేరకు మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా 20 నుంచి 25 రోజులే కొనుగోలు చేస్తున్నారు. సమయపాలన పాటించకపోవడంతో రైతులు వెనుదిరగాల్సి వస్తోంది. గత సంవత్సరం సీసీఐ 52,02,111 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. ఈయేడాది 26,459 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్, నాఫెడ్, డీసీఎంఎస్ ద్వారా క్వింటాల్ కందులకు మద్దతు ధర రూ.4300తో నెలరోజులు కొనుగోలు చేసి నిలిపివేశారు. దీంతో వ్యాపారులకు రూ.3500 నుంచి రూ.3700లకు అమ్మి నష్టపోతున్నారు. శెనగలు గత నెలలో ప్రభుత్వ రంగ సంస్థలు మద్దతు ధర రూ.3100తో 25 రోజులు కొనుగోలు చేసి నాణ్యత లేమి పేరిట నిలిపివేశాయి. దీంతో వ్యాపారులను ఆశ్రయించి రూ.2200 నుంచి రూ.2400 క్వింటాల్ చొప్పున విక్రయించి నష్టపోతున్నారు. వరి ధాన్యం ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీయూ ద్వారా ఏ-గ్రేడ్‌లో క్వింటాలుకు రూ.1345, బీ-గ్రేడ్ రూ.1310 కొనుగోలు చేస్తున్నా.. పలు గ్రామాల్లో అందుబాటులో లేక వ్యాపారులకు రూ.1150 నుంచి రూ.1250 వరకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. మొక్కజొన్న రూ.1310కు కొనుగోలు చేయాల్సి ఉండగా మార్కెట్లో ఆ ధర లభించక రూ.1200లకే అమ్ముతున్నారు. పత్తి క్వింటాలుకు మద్దతు ధర రూ.4వేలు ఉన్నా.. మార్కెట్లో అధికంగా రూ.300 నుంచి రూ.400 లభిస్తుంది. ఇప్పటికే 90 శాతం మంది రైతులు పత్తిని విక్రయించారు. అధిక ధర వస్తుందని కొందరు బడా రైతులు ఇళ్లలో నిల్వ చేసిన పత్తికి రూ.4,300 నుంచి రూ.4,450 వరకు ధర పలుకుతోంది. క్వింటాలు మక్కలకు మద్దతు ధర కంటే రూ.150 నుంచి రూ.200 వరకు ధర తక్కువగా వస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. శెనగలకు రూ.700 నుంచి రూ.850 వరకు ధర తక్కువగా లభిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు చొరవ తీసుకుని మద్దతు ధర దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
ప్రభుత్వ సంస్థలపై ఉక్కుపాదం
హెరిటేజ్ డెయిరీ దెబ్బకు విజయాడెయిరీ మూత గల్లా ఫుడ్స్ దెబ్బకు ఏపీ ఫుడ్ {పాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్ మూత పాడి రైతులు చంద్రబాబు డెయిరీకి పాలమ్ముతున్న వైనం పండ్ల తోటల రైతులు గల్లా ఫుడ్స్‌కు పండ్లమ్ముతున్న చిత్రం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఇరువురు నేతల స్వార్థానికి జిల్లాలో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయి. వేల మంది పాడి రైతులు, పండ్లతోటల రైతులకు ఆ ఇద్దరు నెలకొల్పిన సంస్థలకు పాలు, పండ్లు అమ్ముకునే విధంగా పథకం రూపొందించారు. చిత్తూరు జిల్లా పాడిపరిశ్రమకు పెట్టింది పేరు. దేశంలోనే అగ్రస్థానంలో పాలు ఉత్పత్తి చేస్తోంది. ప్రభుత్వం తరఫున విజయ డెయిరీ లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించేది. ఈ డెయిరీకి 23 సంవత్సరాల చరిత్ర ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఉన్న పాల ఉత్పత్తిని గమనించారు. పాల ఉత్పత్తులు తయారు చేయించడంతో పాటు పాలను కొనుగోలు చేస్తే మంచి లాభా లు చూడవచ్చునని భావించి హెరిటేజ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపించిన రెండు సంవత్సరాలకే విజయా డెయిరీ మూతపడింది. విజయాడెయిరీకి పాలు పోసే రైతులంతా హెరి టేజ్ డెయిరీకి పాలు పోయడం ప్రారంభించారు. ప్రభుత్వ సంస్థను నిర్వీర్యం చేసి సొంత సంస్థకు జిల్లాలో ఎదురులేకుండా తయారు చేసుకున్న ఘనత చంద్రబాబుకు దక్కిందని పలువురు విమర్శిస్తున్నారు. చిత్తూరు జిల్లా మామిడి ఉత్పత్తికి పేరుగాంచింది. అయితే మామిడి దిగుబడికి తగినం తగా ధరలు లేక రైతులు ఇబ్బందులు పడడంనాటి సీఎం ైవె ఎస్.రాజశేఖరరెడ్డి గుర్తించారు. వీరికోసం తిరుపతిలోని మార్కెట్ యార్డు వద్ద రూ.22.70 కోట్ల వ్యయంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్‌ని 2008లో ప్రారంభించారు. యూనిట్లో తమ ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు 570 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిని ఒక ఏడాది నడిపేందుకు ప్రభుత్వం నుంచి ముంబయిలోని జాక్షన్ కంపెనీవారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మొదటిసారిగా 2008 ఆగస్టు 8న ఏ వన్ గ్రేడ్ మామిడి పండ్లు దుబాయ్‌కి ఎగుమతి చేశారు. పండ్ల ఎగుమతులకు మంచి అవకాశం ఉందని అందరూ భావించారు. రైతులు కూడా ఎక్కువగా మామిడితోపాటు ఇతర పండ్ల తోటలు వేసేందుకు నిర్ణయించారు. ఉన్నట్లుండి కంపెనీ సక్రమంగా పనిచేయడం మానేసింది. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి చంద్రగిరికి సమీపంలోని కాశిపెంట్ల వద్ద 2009 నవంబరులో గల్లా ఫుడ్స్ ఏర్పాటు చేశారు. రైతులు పండించిన మామిడిని నేరుగా గల్లా ఫుడ్స్ కంపెనీ కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీంతో ప్రభుత్వ కంపెనీ మూతపడింది. కంపెనీలోని పరికరాలు పనికి రాకుండా తుప్పు పట్టాయి. ఈ కంపెనీని లీజుకు తీసుకోకుండా మంత్రి చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి.