సాక్షి, అమరావతి : వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీసీల పట్ట బాబు చూపిస్తున్న కపట ప్రేమను విజయసాయిరెడ్డి ఎండగట్టారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించిన ఆయన..‘చంద్రబాబు.. బీసీలు నీ కంటికి మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా? అధికారం ఉన్నప్పుడు బీసీలను ఆమడ దూరంలో పెట్టిన నీవు.. ఇప్పుడు భూస్థాపితమైన పార్టీని మోయమని చెప్పడం ఏం న్యాయం? అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు నీవు చేసిన అన్యాయం ఇంకా సరిపోలేదనా? లేక భారానికి, అధికారానికి తేడా వాళ్ళకు తెలియదనా?’ అని ప్రశ్నించారు. (పురందేశ్వరిపై విమర్శనాస్త్రాలు...)
అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించారు. వైఎస్సార్ చేయుత కింద లబ్ధి పొందిన మహిళల చేత 11,270 రిటైల్ అవుట్‌లెట్లు ప్రారభించినట్లు తెలిపారు. మొదటి దశలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో అమూల్ సహకారంతో త్వరలో పాల సేకరణ కేంద్రాలు ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా లబ్ధి దారులు స్వయం ఉపాధి పొందనున్నట్లు పేర్కొన్నారు. (‘పంటల బీమాపై రైతులదే తుది నిర్ణయం’)
Comments
Please login to add a commentAdd a comment