
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబూ.. నేరుగా అడుగుతున్నా.. ఇంతకీ డాక్టర్ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా?, లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్, డాక్టర్ రమేష్.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?’ అంటూ ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు.
వెన్నుపోటుకు 23 ఏళ్ళు.
మరో ట్వీట్‌లో.. 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు ఎన్టీఆర్‌ను చంద్రబాబు & కో వెన్నుపోటు పొడిచి, పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించి, పార్టీ పగ్గాలు లాక్కుని, ఎన్టీఆర్‌నుని అవమానించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ మీద సస్పెన్షన్ ఎత్తేస్తారేమో చూడాలి. అంటూ విమర్శించారు.
సాక్షి, విజయవాడ : స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో డాక్టర్ రమేష్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఎనిమిదవ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి వాదనలు విననున్నారు. అలాగే రిమాండ్‌లో ఉన్న రమేష్ హాస్పిటల్ సిబ్బంది బెయిల్ పిటిషన్‌పై కూడా నేడు విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment