నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు: కేశినేని నాని | Vijayawada MP Kesineni Nani Interesting Political Comments | Sakshi
Sakshi News home page

నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు: కేశినేని నాని

Published Sat, Jun 25 2022 7:48 PM | Last Updated on Sat, Jun 25 2022 7:48 PM

Vijayawada MP Kesineni Nani Interesting Political Comments - Sakshi

సాక్షి, అమరావతి: తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించారు. ’తన శత్రువును మీరు ప్రోత్సహిస్తే మీ శత్రువును నేను ప్రోత్సహిస్తా. మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. నేను అందరివాడిని. ఏ పార్టీకి చెందిన వాడిని కాదు’ అని వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా తన సోదరుడు కేశినేని శివనాథ్‌ని పార్టీ అధిష్టానం ప్రోత్సహిస్తుండడం, వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రచారం చేస్తుండడంతో నాని ఈ వ్యాఖ్యలు చేశారు.  

చదవండి: (కోవర్టులు కంట్రోల్‌లో ఉండకపోతే ఇక నేను ఊరుకోను: దివ్యవాణి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement