సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్, సత్తుపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తు న్నారని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి బీజేపీ ఈసీ వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రిశశిధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ అధికారుల తీరుపై విచారణకు ఆదేశించాలని, వెంటనే బదిలీ చేయాలని కోరారు.
ఎన్ని కల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఈ నెల 9న కేంద్ర మంత్రి బీఎల్ వర్మ ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైందని.. కానీ షెడ్యూల్ వెలువడటంతో ఎస్‌సీసీఎల్ అధికారులు, గ్రీన్‌ఫీల్డ్ హైవేస్ అథారిటీ, ఇతర ప్రభుత్వ అధికారులతో ఆ సమావేశాన్ని విరమించుకున్నారని సీఈవోకు వివరించారు. కేంద్రమంత్రి సమావేశం జరగకపోయినా కూడా.. ఆ సమావేశంలో పాల్గొని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ వీరం రాజుపై అధికారులు కేసు పెట్టారని మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎస్‌ఆర్ నిధులతో ప్రలోభమంటూ..
స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులను పూర్తిగా మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గంలోని డెయిరీ, టైలరింగ్ యూనిట్లకు ఖర్చు చేస్తున్నారని ఢిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ఇది సరికాదని.. స్త్రీనిధి సంస్థ ఎండీ, ఇతర రిటైర్డ్ అధికారులను వారి బాధ్యతల నుంచి రిలీవ్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment