సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి రెండంకెల సంఖ్య (డబుల్ డిజిట్)లో ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో కిషన్‌రెడి మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాం«దీతో సహా యూపీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు లోక్‌సభకు సెమీఫైనల్ అన్నార ని గుర్తు చేశారు.
ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారని, మధ్యప్రదేశ్‌లో నభూతో నభవిష్యతి అనేలా రికార్డ్ స్థాయిలో బీజేపీకి మెజారిటీ వచ్చిందని ఆయన ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా తిరుగులేని మెజారిటీతో మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని చెప్పారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ శ్రేణులు సంసిద్ధం అయ్యేలా గురువారం కొంగరకలాన్‌లోని శ్లోక ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.
జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ , పార్టీ మండల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వినర్లు, ఇంచార్జులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు, మోర్చాల జాతీయ పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలియజేశారు.
సమీక్షల తర్వాతే నియోజకవర్గాల్లో సమావేశాలు
ప్రస్తుతం అన్ని జిల్లాల్లో శాసనసభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షలు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సమీక్షల తర్వాత రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి, లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు గానూ రానున్న తొంభై రోజులకు ‘ఎలక్షన్ యాక్షన్ ప్లాన్’రూపొందించుకుని ముందుకెళ్తామని చెప్పారు.
ఆ రోజున ప్రతి హిందువు ఇంట్లో దీపం వెలగాలి
జనవరి 22న అయోధ్యలో జరిగే భవ్య రామమందిర ప్రాణప్రతిష్ట మహోత్సవంలో బీజేపీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున భాగస్వామ్యం కా వాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 22న దేశంలోని ప్రతీ దేవాలయాన్ని అలంకరించి, గుడుల ముందు స్క్రీన్లు ఏర్పాటు చేసి రామమందిర ప్రారం¿ోత్సవాన్ని భక్తులు వీక్షించేలా ఏర్పా ట్లు చేయాలని ఆయా మందిరాల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ప్రతి హిందువు తమతమ ఇళ్లలో దీపాలు వెలిగించి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కిషన్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment