బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-4) | Will Chandrababu Answer Questions Rythu Bharosa Aqua Schemes | Sakshi
Sakshi News home page

బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-4)

Published Mon, Feb 19 2024 9:17 PM | Last Updated on Mon, Feb 19 2024 9:20 PM

Will Chandrababu Answer Questions Rythu Bharosa Aqua Schemes - Sakshi

‘‘లేస్తే మనిషిని కానన్నా’’డట వెనకటికి ఎవరో. ఇప్పుడు బాబు, అండ్‌ ఆయన పచ్చమంద తీరు అలాగే ఉంది. పద్నాలుగేళ్లు అధికారం వెలగబెట్టినా... మూడుసార్లు సీఎం కుర్చీపై కూర్చున్నా చెప్పుకోదగ్గ పథకం, కార్యక్రమేదీ చేపట్టలేని బాబుగారు... ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మరోసారి ‘నేను అధికారంలోకి వస్తే...’’ అంటూ మొదలుపెట్టారు.

లేస్తే మనిషిని కానన్నట్టుగానే. అందుకే... ఐదేళ్లుగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సుపరిపాలన అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి తన వల్ల మంచి జరిగి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయమని ధీమాగా చెబుతున్నారు. జగన్‌ అది చేశారా? ఇది చేశారా? అని పచ్చమంద నోరు పారేసుకునే ముందు.. ఒక్కసారి ఈ ప్రశ్నలకు జవాబు ఉందేమో చూసుకోండి!

  • ప్రపంచ ఖ్యాతి పొందిన రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుతున్న సేవలపై చర్చకు సిద్దమా? ఈ 58 నెలల్లో విత్తనాలు, ఎరువుల కోసం ఎక్కడైనా ఏ ఒక్క రైతు అయినా క్యూలైన్‌లో నిల్చున్నాడని నిరూపించగలరా?
  • వాస్తవ సాగుదారులను గుర్తించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ క్రాప్‌ అమలు తీరుపై,ఈ క్రాప్‌ ప్రామాణికంగా అర్హులైన ప్రతీ రైతుకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న విధానంపై చర్చకు సిద్ధమా?
  • వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అందిస్తోన్న పెట్టుబడి సాయంపై చర్చకు సిద్ధమా..అదే సమయంలో నువ్వు బేషరతుగా అమలు చేస్తానన్న రైతు రుణమాఫీపై కానీ, ఎన్నికల ముందు అమలు చేసిన అన్నదాత సుఖీభవ ద్వారా ఎంత మందికి సాయం అందించ గలిగావో చెప్పగలవా?
  • వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కోసం చర్చకు సిద్ధమా.. పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న విధానం, ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రైతులకు అందించిన పరిహారం విషయమై చర్చకు సిద్ధమా?
  • నీ హయాంలో పక్కదారి పట్టిన రైతు రథాలు, మూలన పడ్డ రెయిన్స్‌ గన్స్‌పై కానీ, ఈ ప్రభుత్వ హాయంలో ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన యంత్ర సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై కానీ చర్చకు సిద్ధమా
  • ఆర్బీకేలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన గోదాములు, కలెక్షన్‌ సెంటర్స్, కోల్డ్‌ స్టోరేజ్‌లు, ఇతర మౌలికసదుపాయాలపై చర్చకు సిద్ధమా?
  • ఆక్వా రంగానికి ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలులుపై చర్చకు సిద్ధమా..యూనిట్‌ 1.50లకే విద్యుత్‌ సరఫరా చేస్తుండడం, ఆక్వారైతులకు ప్రభుత్వం నిర్ధేశించిన మద్దతు ధర దక్కేలా చేయడంలో కానీ, రైతులకు, ప్రాసెసింగ్‌ ఆపరేటర్లు,ఎగుమతిదారులతో 25 సార్లు సమావేశాలు నిర్వహించిన విధానంపై కానీ చర్చకు సిద్ధమా?
  • మత్స్యకారులకు రూ.10వేల చొప్పున అందిస్తోన్న వేట నిషేధ భృతి, ఆయిల్‌ సబ్సిడీ పెంపు ద్వారా మత్స్యకారులకు కలుగుతున్న లబ్ది, చనిపోయిన రూ.10లక్షల చొప్పున ఇస్తున్న ఆర్ధిక సాయంపై చర్చకు సిద్ధమా?
  • ఉద్యాన పంటల దిగుబడులు, ఎగుమతులు మీ హయాంతో పోల్చుకుంటూ గడిచిన 58 నెలల్లో ఏ మేరకు పెరిగిందో చర్చించేందుకు సిద్దమా
  • దేశంలో మరెక్కడా లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి, ఆక్వా, పశుసంవర్ధక టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ద్వారా అందిస్తోన్నసేవలపై చర్చకు సిద్ధమా?
  • జగనన్న పాలవెల్లువ కింద ఏర్పాటు చేసిన అమూల్‌ కేంద్రాలకు పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ.10–20లు అదనపు లబ్ది కల్పిస్తున్న విధానంపై చర్చకు సిద్ధమా?
  • నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలు, దేశీయ గో జాతి వృద్ధి కోసం ఏర్పాటుచేసిన కేంద్రాల ఏర్పాటుపై చర్చకు సిద్ధమా?

చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-3) 

ఈ వార్త కూడా చదండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-2)

చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-1)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement