సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర ఆదివారం లోటస్‌పాండ్ లోని వైఎస్సార్‌టీపీ కార్యాలయం నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతుండటంతో ఆ వేదన చెందిన షర్మిల రైతు ఆవేదన యాత్రను తలపెట్టారు. 23 వరకు యాత్ర కొనసాగ నుంది. ఈ యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఆ కుటుంబాలకు వైఎస్సార్‌టీపీ తరుఫున సాయం అందజేయనున్నారు.
రైతు ఆవేదన యాత్ర సాగుతుందిలా..
ఆదివారం గచ్చిబౌలి నుంచి నర్సాపూర్ మీదు గా మెదక్ జిల్లాలోని కంచనపల్లికి రైతు ఆవేదన యాత్ర చేరుకుంటుంది. అక్కడ ఆత్మహ త్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. తర్వాత లింగంపల్లిలో మరొ క రైతు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పనున్నారు. ఆ పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ వాడు క రాజగోపాల్, చంద్రహాస్‌రెడ్డి రైతు ఆవేదన యాత్ర రూట్‌మ్యాప్‌ను ప్రకటించారు.
రెండవ రోజు.. 20న నిజామాబాద్ జిల్లా సైదేశివారినగర్, లింగంపేట, నాగిరెడ్డిపేట్ మండలాల్లో రైతు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. మూడో రోజు.. 21న కరీంనగర్ జిల్లా లో, 22న ఆదిలాబాద్ జిల్లాలో షర్మిల యాత్ర సాగనుంది. చివరి రోజైన 23న అన్నోజీగూడ లో యాత్ర ముగుస్తుందని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment