సాక్షి, తాడేపల్లి: వరదలు వస్తాయని తెలిసినా అలర్ట్ చేయకుండా విజయవాడ ప్రజల ప్రాణాలను బలిగొన్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో బాధ్యత లేకుండా మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్ కామెంట్స్‌పై చురకలంటించింది. రెడ్‌బుక్ అంటే పాలన చేసే నువ్వా.. వైఎస్ జగన్ గురించి మాట్లాడేది అంటూ పలు ప్రశ్నలు సంధించింది.
కాగా, వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా..‘లోకేష్.. నీకు సిగ్గుందా? నిన్న కూడా హైదరాబాద్ వెళ్లి.. పొద్దుట స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చావ్. నీకు ప్రజల గురించి పట్టింపు ఉందా?. హుందాతనం గురించి నువ్వు మాట్లాడితే.. ఆ పదమే సిగ్గుపడుతుంది. రాజకీయాల్లో బజారు భాషని ప్రవేశపెట్టి, రెడ్‌బుక్ అంటూ ఒక ఎర్రిబుక్కు పట్టుకుని పిచ్చి పాలన చేస్తున్న నువ్వు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని నిందించడం విడ్డూరంగా ఉంది. లక్షల మంది ప్రజలను వరదలకు వదిలేసి, పదుల కొద్దీ ప్రజల ప్రాణాలు తీసిన మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదన్న అహంకారాన్ని ముందు విడిచిపెట్టు.
లోకేష్.. నీకు సిగ్గుందా? నిన్నకూడ హైదరాబాద్ వెళ్లి.. పొద్దుట స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చావ్. నీకు ప్రజలగురించి పట్టింపు ఉందా? హుందాతనం గురించి నువ్వు మాట్లాడితే.. .ఆ పదమే సిగ్గుపడుతుంది. రాజకీయాల్లో బజారు భాషని ప్రవేశపెట్టి, రెడ్‌బుక్ అంటూ ఒక ఎర్రిబుక్కు పట్టుకుని పిచ్చిపాలన… https://t.co/g4EvnQTKz4 pic.twitter.com/EUKxSm2uuD
— YSR Congress Party (@YSRCParty) September 8, 2024
1.అలర్ట్ వచ్చినా అంత మందిని తరలించలేక వదిలేశామని మీ రెవెన్యూ సెక్రటరీ అన్నారు?. దీని అర్థం చస్తే చావనీ అని విజయవాడ ప్రజలను వదిలేశారా? లేదా?
2.వెలగలేరు గేట్లు ఎత్తే ముందు 20 గంటలు ముందుగానే అలర్ట్ చేశామని ప్రభుత్వ ఇరిగేషన్ ఇంజినీరు చెప్పాడు. మరి ఎందుకు ప్రజలను శిబిరాలకు తరలించలేదు?
3.ఇంత విపత్తు ఉన్నట్టుగా మాకు అలర్ట్ లేదని సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఇది మీ ప్రభుత్వ లోపం కాదా?
4.ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణానదిపై ప్రాజెక్టుల్లో ఫ్లడ్ కుషన్ ఎందుకు పెట్టుకోలేదు. మీ నిర్లక్ష్యం కాదా?
ఈ ఘోరవైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు, నువ్వు, మీ మంత్రులు పబ్లిసిటీ స్టంట్లు మొదలుపెట్టారు. సానుభూతి స్టోరీలు సృష్టిస్తున్నారు. ఎనిమిది రోజులు గడిచినా ఇప్పటికీ కనీసం ప్రతి ఇంటికీ ఆహారం అందించగలిగామని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఇది కచ్చితంగా చంద్రబాబు సృష్టించిన విపత్తే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment