
ఎస్పీ మలికా గర్గ్ ( ఫైల్)
ఒంగోలు టౌన్: బ్లూ టూత్ ద్వారా జరుగుతున్న నేరాలు ఎక్కువై పోతున్న నేపథ్యంలో ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మలికా గర్గ్ సూచించారు. ఈమేరకు ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. హ్యాండ్ ఫ్రీ సాంకేతికత వలన నేటి రోజుల్లో చేతికి పెట్టుకునే వాచీ మొదలు కొని చెవులకు ధరించిన ఇయర్‌పాడ్ వరకు బ్లూటూత్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వైర్‌లెస్ పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, దాంతో ఫోన్లో బ్లూటూత్ ,వైఫై, హోట్‌స్పాట్ ఎప్పుడూ ఆన్‌లో పెట్టడం అలవాటై పోయిందని వివరించారు. దీనివల్ల సైబర్ నేరగాళ్లు ఫోన్లలోని సమాచారాన్ని సులువుగా తస్కరిస్తున్నారని, దీన్ని అడ్డం పెట్టుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారన్నారు. కేవలం పది మీటర్ల దూరం నుంచే పెయిర్ రిక్వెస్టు పంపిస్తున్నారని, పొరపాటున ఓకే బటన్ నొక్కితే చాలు మనం మోసాగాళ్ల బారిన పడినట్లే అన్నారు. ఫోన్ కనెక్ట్ అయిన వెంటనే మాల్వేర్‌తో పాటుగా ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్‌ను ఫోన్లలోకి పంపించి మన ఫోన్లను వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారని, ముఖ్యమైన డేటాని దొంగలించి డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. బ్లూటూత్ బగ్గింగ్ తరహా సైబర్ మోసాల తీరుపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ తరహా మోసాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రతలను ఆమె సూచించారు. బిబగ్గింగ్ మోసాలకు గురైన వారు దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేయడం కాని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపో
ర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
బిబగ్గింగ్ తరహా సైబర్ నేరాలతో జాగ్రత్త
బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫై
ఉపయోగించవద్దు
ఎస్పీ మలికా గర్గ్ సూచన
తీసుకోవాల్సిన జాగ్రతలు
బహిరంగ ప్రదేశాల్లో అవసరమైతే తప్ప మిగిలిన సమయాల్లో బ్లూ టూత్ ఆఫ్ చేయాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, రద్దీగా ఉన్నచోట బ్లూటూత్, వైఫై, హాట్ స్పాట్‌లను ఉపయోగించకుండ కూడదు.
పరిచయం లేని వ్యక్తులు పంపించే పెయిర్ రిక్వెస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దు.
డేటాలో హెచ్చు తగ్గుల్ని గమనిస్తూ ఉండాలి. అదనపు భద్రతకు వీపీఎన్ వినియోగించాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫై ఉపయోగించవద్దు.
Comments
Please login to add a commentAdd a comment