
పూట గడవక..!
కూలి అందక..
బేస్తవారిపేట: వలసలు నివారించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించేందుకు 2006లో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పనిచేసిన కూలీలకు వారం రోజుల్లో వేతనాలు అందించాల్సి ఉంది. ప్రతి కూలీకి రోజువారీ వేతనం రూ.300 నిర్దేశించగా, కూలీలు చేసిన పనికి రూ.275 ప్రకారం అందిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. గతంలో నెలల తరబడి వేతనాలు అందని పరిస్థితి ఎప్పుడూ లేదని కూలీలు వాపోతున్నారు.
సౌకర్యాలు అంతంతమాత్రమే..
ఉపాధి కూలీలకు నిలువ నీడ లేదు. మండుటెండలో విలవిల్లాడుతున్నారు. వేసవిలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఇబ్బందులు పడుతున్నారు. పనుల సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి కనీసం నీడ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిచేసే సమయంలో వడదెబ్బ, చిన్నచిన్న గాయాలవుతుంటాయి. ఈ సమయంలో ప్రాథమిక చికిత్స చేయడానికి మెడికల్ కిట్లు పని ప్రదేశంలో ఉంచాలి. వాటిని కూడా ప్రభుత్వం ఇంత వరకు సరఫరా చేయలేదు. వేతనదారులు డీహైడ్రేషన్‌కు గురైతే కనీసం ఓఆర్‌ఎస్ ప్యాకెట్ కూడా లేని పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. గతంలో వేసవిలో కూలీలకు మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు, ఎండల్లో పనిచేసే వారికి టార్పాలిన్ పట్టలు పంపిణీ చేశారు. కానీ ఇటీవల కూలీలకు అందే సౌకర్యాలు తగ్గించడంతో పని ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పడం లేదు.
ఇతర పనులకు మొగ్గు..
జిల్లాలోని 38 మండలాల్లో గుర్తించిన 840 పనుల్లో 59,011 మంది కూలీలకు పని కల్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వారిలో సగం 36,260 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారు. రెండు, మూడు నెలల కూలి డబ్బులు అందక కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కూలీలు క్రమంగా ఉపాధి పనులకు స్వస్తి పలుకుతూ ప్రత్యామ్నాయ పనులు వెతుక్కునే పనిలో పడ్డారు.
ఉపాధి కూలీలకు రెండున్నర నెలలుగా అందని వేతనం
చేసిన పనికి ప్రతిఫలం అందక కూలీల ఆవేదన
ఉపాధిపై నమ్మకం లేక ఇతర పనులకు మొగ్గు
పని ప్రదేశంలో లేని మెడికల్ కిట్లు
తక్కువ కూలీలు హాజరవుతున్న మండలాలు..
మండలం హాజరు హాజర
కావాల్సిన వుతున్న
కూలీలు కూలీలు
సింగరాయకొండ 2216 987
తర్లుపాడు 1721 672
యర్రగొండపాలెం 2366 975
కురిచేడు 739 347
గిద్దలూరు 1294 762
దర్శి 1531 689
కొత్తపట్నం 1416 730
పొదిలి 2237 1288
రాచర్ల 1899 809