తప్పుడు కేసుకు ఒప్పుకోలేదని.. | - | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసుకు ఒప్పుకోలేదని..

Published Sat, Apr 5 2025 2:21 AM | Last Updated on Sat, Apr 5 2025 2:28 AM

తప్పుడు కేసుకు ఒప్పుకోలేదని..

తప్పుడు కేసుకు ఒప్పుకోలేదని..

ఎండీయూ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు

టంగుటూరు: మండలంలోని సూరారెడ్డిపాలెంలో గురువారం సాయంత్రం రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఎండీయూ ఆపరేటర్‌ అంకయ్య కథనం మేరకు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ శివరామకృష్ణ, ఎఫ్‌ఐ ప్రమోద్‌ వాహనాన్ని తనిఖీ చేశారు. 100 కేజీల రేషన్‌ బియ్యానికిగాను 50 కేజీల బస్తా ఒకటి, మరో బస్తాలో 33 కేజీలు ఉన్నాయి. అయితే 50 కేజీలు తక్కువగా ఉన్నాయని అధికారులు నివేదిక రాసుకున్నారు. ఆ మేరకు సంతకం చేయాలని ఒత్తిడి చేశారు. వెంకయ్య అందుకు అంగీకరించకపోవడంతో ఎండీయూ వాహనాన్ని అధికారులు తీసుకెళ్లిపోయారు. దీనిపై టంగుటూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోలేదని, జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని అంకయ్య చెప్పారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుడిని అనే కక్షతో అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

క్రికెట్‌ బెట్టింగులపై నిఘా

ఒంగోలు టౌన్‌: క్రికెట్‌ బెట్టింగులకు యువత దూరంగా ఉండాలని, బెట్టింగులకు పాల్పడేవారిపై గట్టి నిఘా పెట్టామని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం డీఎస్పీ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్టీసీ బస్టాండు, అద్దంకి బస్టాండు సెంటర్‌, నెల్లూరు బస్టాండు, మంగమూరు రోడ్డు, తదితర ముఖ్య కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 15 బృందాలుగా ఏర్పడిన పోలీసులు బెట్టింగులకు పాల్పడే వారిని గుర్తించేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గుంపులుగా వున్న వారి ఫోన్లను పరిశీలించారు. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై ఆన్‌లైన్‌ బెట్టింగులు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సుమారు 1000 మంది ఫోన్లను పరిశీలించగా 18 మంది ఫోన్లలో అనమానాస్పద యాప్లను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్న నేఫథ్యంలో బెట్టింగులకు పాల్పడేవారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీల్లో వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, తాలూకా సీఐ అజయ్‌కుమార్‌, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement