వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Published Sat, Apr 5 2025 2:21 AM | Last Updated on Sat, Apr 5 2025 2:28 AM

వేర్వ

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

పెద్దదోర్నాల/పెద్దారవీడు: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో సంభవించిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. పెద్ద దోర్నాల మండలంలోని గంటవానిపల్లె సమీపంలో కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై బైక్‌ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వై.చర్లోపల్లికి చెందిన పాముల విజయభాస్కర్‌(25), అతని సన్నిహితుడు కటారి పోల్‌రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్సై మహేష్‌ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే విజయభాస్కర్‌ మృతి చెందినట్లు వైద్యాధికారి లావణ్య ధ్రువీకరించారు. మండలానికి చెందిన 108 వాహనం ఇతర ప్రాంతానికి వెళ్లిన నేపథ్యంలో ఎస్సై తన వాహనంలోనే క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. విజయభాస్కర్‌ ప్రాణాలు కాపాడేందుకు ఎస్సై మహేష్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పెద్దారవీడు మండలంలో..

రోడ్డుపై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించపోయిన జీపు అదుపుతప్పి బోల్తాపడగా అదే సమయంలో అక్కడ నిలిపిన లారీని వెనుక నుంచి వచ్చిన మరో ట్రక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ రైతు మృతి చెందగా, మరో రైతు, డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు–తోకపల్లి గ్రామాల మధ్య చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జాతీయ రహదారిపై గుంటూరు వైపు వెళ్తున్న జీపు అదుపుతప్పి బోల్తా పడింది. వెనకాల వస్తున్న లారీ డ్రైవర్‌ గమనించి అకస్మత్తుగా నడిరోడ్డుపై నిలిపివేశారు. జీపులో ఉన్న వారిని రక్షించేందుకు డ్రైవర్‌, క్లీనర్‌ కిందకు దిగి వెళ్తుండగా వీరి లారీని మిరపకాయల లోడుతో వస్తున్న ట్రక్‌ ఢీకొట్టింది. చిమ్మచీకటి, వర్షం కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో మిర్చి ట్రక్‌ లో ఉన్న ఇద్దరు రైతులతో పాటు డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. రైతు ఖాసిం మృతి చెందగా మరో రైతు, డ్రైవర్‌ను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కాగా, బోల్తా పడిన జీపులో ప్రయాణిస్తున్న 13 మందిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.అనిల్‌కుమార్‌ తెలిపారు.

సంతనూతలపాడు మండలంలో...

సంతనూతలపాడు: మండలంలోని ఎనికపాడు – గుమ్మలంపాడు రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనికపాడు గ్రామానికి చెందిన ఎర్రగుంట్ల సుబ్బాయమ్మ (55) మృతి చెందింది. ఎనికపాడు గ్రామానికి చెందిన దర్శి సుబ్రహ్మణ్యం మోటార్‌ సైకిల్‌పై సుబ్బాయమ్మ గుమ్మలంపాడు వెళుతుండగా, మార్గం మధ్యలో గొర్రెలు తగిలి ఆమె కిందపడింది. గాయపడిన ఆమెను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది.

సంతనూతలపాడు, పెద్దదోర్నాల,

పెద్దారవీడు మండలాల్లో ప్రమాదాలు

బైక్‌ ప్రమాదాల్లో యువకుడు, మహిళ దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు

లారీని మరో వాహనం ఢీకొన్న ఘటనలో రైతు మృతి, పలువురికి గాయాలు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి 1
1/2

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి 2
2/2

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement