
జగ్జీవన్‌రామ్ అడుగుజాడల్లో నడవాలి
ఒంగోలు వన్‌టౌన్: సామాజిక న్యాయం, స్వాతంత్య్రం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యెధుడు, మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడవాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల సందర్భంగా శనివారం ఆయన విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం మాట్లాడారు. ఆయన తన జీవితాన్ని సామాజిక న్యాయం, రైతుల సంక్షేమం, దేశ అభివృద్ధికి అంకితం చేశారన్నారు. అతి చిన్న వయస్సులోనే శాసన సభ్యులుగా ఎన్నికయ్యారని, 8 సార్లు పార్లమెంటు సభ్యులుగా కూడా పని చేశారన్నారు. కేంద్ర కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ మంత్రిగా కూడా సేవలందించారన్నారు. మరణించే వరకూ దేశ సేవకు, సమాజ అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, జేసీ ఆర్ గోపాల కృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేశు, నగర మేయర్ గంగాడ సుజాత, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎన్ లక్ష్మానాయక్, నీలం నాగేంద్రరావు, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, బిళ్లా చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
జగ్జీవన్‌రామ్‌కు ఎస్పీ నివాళులు
ఒంగోలు టౌన్: బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని ఎస్పీ ఏఆర్ దామోదర్ కొనియాడారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలను జగ్జీవన్‌రామ్ అందించారని తెలిపారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజలకు సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే అంశాన్ని చేర్చడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. కార్మికుల హక్కులు, వ్యవసాయ రంగం అభివృద్ధి, విద్యారంగంలో సంస్కరణలు చేపట్టి మంచి పరిపాలనా దక్షకుడిగా పేరొందారని చెప్పారు. దేశ ప్రజల చేత బాబూజీగా కొనియాడబడుతున్న జగ్జీవన్‌రామ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్‌ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఏఆర్ ఎస్సైలు పాల్గొన్నారు.
400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
● ఇద్దరిపై బైండోవర్ కేసులు
మార్కాపురం: మార్కాపురం ఎకై ్సజ్ సీఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శనివారం పెద్దదోర్నాల మండలం వైచెర్లోపల్లి అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి పిక్కిలి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. మరో ఇద్దరు పాత నేరస్థులను దోర్నాల తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. వీరికి బెల్లం సరఫరా చేసిన వ్యాపారులపై కూడా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై గోపాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా

జగ్జీవన్‌రామ్ అడుగుజాడల్లో నడవాలి

జగ్జీవన్‌రామ్ అడుగుజాడల్లో నడవాలి