
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్
అల్లూరు (కొత్తపట్నం): వైఎస్సార్ సీపీ, వైఎస్సార్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రోత్సాహంతో కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్‌ఆర్‌కే ఫ్రెండ్స్ యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు తెలిపారు. అల్లూరు ఎంపీటీసీ సభ్యుడు మిట్నసల శాంతారావు, ఎస్‌ఆర్‌కే ఫ్రెండ్స్ యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు టోర్నమెంట్ నిర్వహించే గ్రౌండ్‌లో ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.30 వేలను వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, రెండో బహుమతిగా రూ.20 వేలను వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మూడో బహుమతిగా రూ.15 వేలను వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, అల్లూరు ఉప సర్పంచ్ తాటిపర్తి సుబ్బారెడ్డి, నాలుగో బహుమతిగా రూ.10 వేలను వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆళ్ల రవీంద్రరెడ్డి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా రూ.5,116ను ఎంపీటీసీ మాజీ సభ్యుడు అంబటి వెంకటేశ్వర్లు అందజేయనున్నట్లు వివరించారు. మరో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా రూ.5,116 కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. టెన్నిస్‌బాల్‌తో మ్యాచ్‌లు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలకు 9502474302, 7675849703, 9618342119 నంబర్లను సంప్రదించాలని సూచించారు.