ముస్తాబాద్(సిరిసిల్ల): హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. పోతుగల్‌కు చెందిన గాలిగాని దినేశ్(31) హైదరాబాద్‌లోని ఓ పశు వైద్యశాలలో కాంట్రాక్టు వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. దినేశ్ మృతి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చి వెళ్లిన దినేశ్ ఆక్సిడెంట్‌లో మృతిచెందాడనే విషయం గ్రామస్తులను కలచివేసింది. మృతుడికి భార్య, ఏడాది వయస్సుగల కుమార్తె ఉంది. ఎంతో భవిష్యత్ ఉన్న దినేశ్ అర్ధంతరంగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment