
రైతులకు అవసరమైన పరిశోధనలకు పెద్దపీట
రైతులకు ఓవైపు సాగులో అవసరమైన సలహాలు, సూచనలందిస్తూ.. మరోవైపు రైతులకు అవసరమైన పరిశోధనలకు పెద్దపీట వేస్తు న్నాం. సాగు నీటి సద్వినియోగం, అధిక దిగుబడినిచ్చే విత్త నాలు, పురుగులు, తెగుళ్ల సస్యరక్షణ చర్యలపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాం. – డాక్టర్ ఎన్.బలరాం,
వ్యవసాయ వర్సిటీ డీన్ ఆఫ్ రిసెర్చ్
విస్తరణ సేవలను విస్తృతం చేస్తాం
వ్యవసాయంలో వస్తున్న నూతన టెక్నాలజీ, సాగులో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తాం. శాస్త్రవేత్తలు, ఆ యా జిల్లాల వ్యవసాయాధికారులతో సమావేశాలు నిర్వహిస్తాం. శాస్త్రవేత్తలు క్షే త్రస్థాయి సందర్శన చేయడంతోపాటు అక్కడి రై తులు ఎదుర్కొంటున్న వాటిపై పరిశోధనలు చేసి అండగా ఉంటారు. – డాక్టర్ ఏకాద్రి,
వ్యవసాయ వర్సిటీ డైరెక్టర్ ఆప్ ఎక్స్‌టెన్షన్
పెట్టుబడి పెరుగుతోంది
వ్యవసాయంలో రోజు రోజుకు సాగు పెట్టుబడి పెరుగుతోంది. దీంతో రైతులకు వచ్చే ఆదాయం గిట్టుబాటు కావడం లేదు. తక్కు వ కాలంలో అధిక దిగుబడి, అధిక ఆదా యం వచ్చే పంటలపై పరిశోధనలు చేయా లని శాస్త్రవేత్తలకు చెప్పాం. – ఏలేశ్వరం శేఖర్,
అల్లీపూర్, రాయికల్ మండలం

రైతులకు అవసరమైన పరిశోధనలకు పెద్దపీట

రైతులకు అవసరమైన పరిశోధనలకు పెద్దపీట