
వైద్యసేవలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● డీఎంహెచ్‌వో రజిత
చందుర్తి(వేములవాడ): నిరుపేదల వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో రజిత హెచ్చరించారు. స్థానిక పీహెచ్‌సీని శుక్రవారం డీఎంహెచ్‌వో రజిత, రాష్ట్ర ఎన్సీడీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సత్యేంద్రనాథ్ తనిఖీ చేశారు. డాక్టర్ సత్యేంద్రనాథ్ మాట్లాడుతూ సంక్రమిత వ్యాధిగ్రస్తుల వివరాలను ఎన్‌సీడీ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంపత్‌కుమార్, సీహెచ్‌వోలు సత్యనారాయణ, బాలచంద్రం, చందుర్తి వైద్యాధికారి వేదాచారి పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియామకంపై హర్షం
సిరిసిల్ల: 2008 డీఎస్సీ మెరిట్ అభ్యర్థులను కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గేట్ వద్ద శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుతవిప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
సన్మార్గంలో పయణించాలి
● శ్రీతుకారాం మహారాజ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రతి ఒక్కరు భక్తిమార్గాన్ని ఎంచుకుని సన్మార్గంలో పయణించాలని శ్రీతుకారాం మహారాజ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని సత్సంగ సదనంను బైరాపూర్‌లోని పాండురంగ ఆశ్రమం నుంచి శ్రీతుకారాం మహారాజ్, లక్ష్మణ్ మహారాజ్ బృందం శుక్రవారం సందర్శించారు. సత్సంగ సదనం తరఫున ద్యాప దేవయ్య బృందం సన్మానించారు. తుకారాం మహారాజ్ మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతోపాటు పుణ్యక్షేత్రాలను సందర్శించి భగవంతుని కృపకు పాత్రులు కావాలన్నారు. సత్సంగ సదనం భక్త బృందం సభ్యులు పద్మక్క, శ్యామలక్క, బండారి బాల్‌రెడ్డి, గుర్రపు రాములు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి రూ.50వేల సాయం
● చెక్కు అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి(చొప్పదండి): మండల కేంద్రానికి చెందిన టేకు పద్మ–శంకరయ్యల పూరి గుడిసె గురువారం షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన విషయం తెలిసిందే. వీరికి ప్రభుత్వం తరఫున రూ.50వేల ఆర్థిక సాయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతులమీదుగా అందజేశారు. తహసీల్దార్ కాలె నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్‌యాదవ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, భీంరెడ్డి మహేశ్‌రెడ్డి, కట్ట లచ్చయ్య ఉన్నారు.
మెగా జాబ్‌మేళాకు స్పందన
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. 120 మంది ఇంటర్వ్యూకు హాజరుకాగా 45 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రవణ్‌కుమార్, కంపెనీల ప్రతినిధుల చేతుల మీదుగా నియామకపత్రాలు అందించారు.

వైద్యసేవలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

వైద్యసేవలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

వైద్యసేవలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

వైద్యసేవలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు