
అందని సర్వే గౌరవ వేతనం
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ: రాజన్నను ఆదివారం 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీరామ నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో హోమాలు, పూజలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన మదుకంటి సృజన్–స్వాతి దంపతులు గోశాల, అన్నదానం ట్రస్టులకు కలిపి రూ.3,13,683 చెక్కును ఈవో వినోద్‌రెడ్డికి అందజేశారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్‌ఠాణాకు చెందిన నిమిశకవి శ్రీకాంత్–స్రవంతి దంపతులు అన్నదాన ట్రస్టుకు రూ.1,41,116 ఏఈవో జయకుమారికి అందజేశారు. ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, జి.అశోక్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, శ్రీకాంతాచార్యులు, ఆలయ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ ఉన్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) సర్వే చేపట్టి నాలుగు నెలలు గడుస్తోంది. సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు మాత్రం గౌరవ వేతనం చెల్లించడం లేదు. జిల్లాలో గతేడాది నవంబర్ 9 నుంచి సర్వే కొనసాగింది. సర్వేలో 56 ప్రధానాంశాలతోపాటు ఇతర అనుబంధ అంశాలతో కూడిన సమాచారాన్ని సిబ్బంది ఇంటింటికి తిరిగి సేకరించారు. కాస్త ఇబ్బందులు తలెత్తిన ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా సిబ్బంది సర్వేను విజయవంతం చేశారు.
జిల్లాలో రూ.1.68 కోట్లు పెండింగ్
జిల్లాలోని 12 మండలాలు.. రెండు మున్సిపాలిటీలు.. 261 గ్రామాల్లో 1,90,626 ఇళ్లను గుర్తించి 1,468 బ్లాక్‌లుగా చేసి ప్రతీ 150 ఇళ్ల సర్వేకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు. జిల్లా వ్యాప్తంగా 1,488 మంది ఎన్యూమరేటర్లు, 160 మంది సూపర్‌వైజర్లు సర్వేలో భాగస్వాములయ్యారు. సర్వేలో ఉపాధ్యాయులు, ఆశకార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు రూ.10వేలు, సూపర్‌వైజర్లకు రూ.12వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సర్వే పూర్తయి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. 1,488 మంది ఎన్యూమరేటర్‌లకు రూ.10వేల చొప్పున రూ.1,48,80,000, 160 మంది సూపర్‌వైజర్లకు రూ.12వేల చొప్పున రూ.19.20 లక్షలు రావాలి. గౌరవ వేతనం విషయంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా నిధులు మంజూరు కాకపోవడంతో సిబ్బంది గౌరవ వేతనం పొందలేకపోతున్నారు. సర్వేలో పాల్గొన్న సిబ్బంది మాత్రం తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తమ కష్టాన్ని గుర్తించి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని కోరుతున్నారు.
కులగణన సర్వే పూర్తయి నాలుగు నెలలు
ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు అందని డబ్బులు

అందని సర్వే గౌరవ వేతనం

అందని సర్వే గౌరవ వేతనం

అందని సర్వే గౌరవ వేతనం