
గరుడ వాహనంపై రాములోరి విహారం
● నేడు పెద్ద రథం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నారాయణపూర్ శ్రీసీతా రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు మంగళవారం గరుడవాహనంపై విహరించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మహిళల భక్తి పాటలు.. హన్‌మాన్ మాలధారుల కీర్తనల మధ్య స్వామివారు పురవీధుల్లో విహరించారు. బుధవారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాత్రి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు అర్చకులు వేణుగోపాలచారి తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ మోతె లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచులు నిమ్మ లక్ష్మి, దొమ్మాటి నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ మహేందర్, మాజీ ఎంపీటీసీ అపెరా సుల్తాన, అర్చకులు నవీన్‌చారి భక్తులు పాల్గొన్నారు.