
కొసముట్టని కాళేశ్వరం
● ‘ఎత్తిపోతలు’ పూర్తయ్యేది ఎన్నటికో ? ● వట్టిపోతున్న పంప్‌హౌస్‌లు ● నిలిచిన భూసేకరణ.. ముందుకుసాగని కాల్వలు ● రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే.. ● అన్నదాతల ఆశలు ఆది శ్రీనివాస్‌పైనే...
ఇది కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్. మూడు టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9లో భాగంగా నిర్మించారు. మధ్యమానేరు జలాశయం నుంచి నీటిని సొరంగం ద్వారా మళ్లించి దీనిని నింపుతారు. ఇటీవల మధ్యమానేరు నీటిని మల్కపేట చెరువులోకి పంపింగ్ చేయడంతో ఒక్క టీఎంసీ చేరింది. ఈ నీటిని ఎడమకాల్వ ద్వారా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాలకు అందించాల్సి ఉంది. కుడికాల్వ ద్వారా కోనరావుపేట, వేములవాడఅర్బన్ మండలాలకు సాగునీరు అందించాలి. కానీ మల్కపేట వరకు మాత్రమే గోదావరి జలాలు చేరాయి.
● ఇది కోనరావుపేట మండలం మల్కపేట–కనగర్తి మధ్య నిర్మించిన కుడికాల్వ. భూసేకరణ పూర్తికాకపోవడంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. మల్కపేట జలాశయంలో నీరున్నా ఈ కాల్వకు విడుదల చేయలేని దుస్థితి. కాల్వ పూర్తయితే మల్కపేట, కనగర్తి, ధర్మారం, సుద్దాల, మంగళ్లపల్లి, లింగంపల్లి, మారుపాక వరకు గోదావరి జలాలు చేరేవి. కానీ భూసేకరణకు నిధులు లేక పనులు మధ్యలోనే ఆగిపోయాయి.

కొసముట్టని కాళేశ్వరం

కొసముట్టని కాళేశ్వరం

కొసముట్టని కాళేశ్వరం