
మానేరువాగులో చెక్‌డ్యాం మళ్లీ నిర్మించాలి
సిరిసిల్ల: మానేరువాగులో గతంలో కొట్టుకుపోయిన చెక్ డ్యాంను పునర్ నిర్మించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. నెహ్రూనగర్ వద్ద దెబ్బతిన్న చెక్‌డ్యాంను ఈఎన్‌సీ శంకర్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. విద్యానగర్ మానేరు వంతెన నుంచి సాయిబాబా ఆలయం వరకు మూడు కిలోమీటర్ల పొడవు కరకట్ట పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈఈలు అమరేందర్‌రెడ్డి, కిశోర్ పాల్గొన్నారు.
రైతులకు ఉత్తమ సేవలు అందించాలి
సిరిసిల్లకల్చరల్: వ్యవసాయశాఖ అధికారులు రైతులకు నాణ్యమైన సేవలందించాలని కలెక్టర్ సూచించారు. ఏవోలు, ఏఈవోలతో బుధవారం సమీక్షించారు. పంటకోతలు పూర్తయిన రైతులకు టోకెన్లు జారీ చేయాలన్నారు.