
చమురు ధరలు తగ్గించాలి
● కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఐ నిరసన
సిరిసిల్లటౌన్: పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై బుధవారం అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. పట్టణ కార్యదర్శి పంతం రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు మంద సుదర్శన్, కడారి రాములు, అజ్జ వేణు, లక్ష్మన్, రామస్వామి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
వంటగ్యాస్ ధరలు తగ్గించాలి
పెంచిన వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత కోరారు. సిరిసిల్లలో బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందజేస్తే.. ప్రధాని మోదీ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళలను ఎప్పుడూ చిన్న చూపే చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.